Advertisement
Google Ads BL

రేపు ఒక్కరోజే 17 సినిమాల జాతర


బాక్సాఫీసు కొంచెం డల్ గా నడుస్తుంది. నవంబర్, డిసెంబర్ లో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నాయి కానీ.. పెద్ద స్టార్స్ సినిమాలేవీ విడుదల అవకుండా ప్రేక్షకులని నిరాశపరుస్తున్నాయి. గత ఏడాది ఈ సమయానికి అఖండ బాక్సాఫీసు బూజులు దులిపేసి కలెక్షన్స్ మోత మోగిస్తే.. పుష్ప పాన్ ఇండియా ఫిల్మ్ ఇండియన్ బాక్సాఫీసుని చెడుగుడు ఆడింది. ఇక ఈ ఏడాది డిసెంబర్ లో రవితేజ ఢమాకా సినిమా మినహా చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ కనిపించడం లేదు. గత వారం విడుదలైన హిట్2 మూవీ ప్రేక్షకులని శాటిస్ ఫై చేసింది. ఈ వారం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ 17 సినిమాల విడుదలతో క్రేజీగా కనిపిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

చిన్న సినిమాలే అయినా అందులో ఇంట్రెస్టింగ్ గా కనబడుతున్న సినిమాలు మూడో.. నాలుగో. అటు విడుదల ప్రమోషన్స్ తో కూడా హడావిడి చేస్తున్న మేకర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, రిలీజ్ ప్రెస్ మీట్స్, నటుల ఇంటర్వూస్ అంటూ ఇండస్ట్రీలో హంగామా కనబడుతుంది. అయితే బాక్సాఫీసు దగ్గర విడుదల కాబోతున్న ఈ 17 సినిమాలు చిన్న సినిమాలే అయినా.. అవేమిటో తెలుసుకోవాలనే ఆత్రుత ఆడియన్స్ లో కనబడుతుంది. అందుకే  డిసెంబర్ 9 న విడుదల కాబోతున్న 17 సినిమాల లిస్ట్ కోసం గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.

ఆ 17 సినిమాల్లో సత్యదేవ్-తమన్నాల గుర్తుందా శీతాకాలం, స్వాతి, బ్రహ్మి, శివానీల పంచతంత్రం, ముఖ చిత్రం, ప్రేమ దేశం రీ రిలీజ్, చెప్పాలని ఉంది, లెహరాయి, డెంజరస్, విజయానంద్ డబ్బింగ్ మూవీ, ఆక్రోశం, ఐ లవ్ యు ఇడియట్, హే బుజ్జి నీకు నేను, దోస్తానా, మాయాబజార్, AP 04 రామారావు, @లవ్, డాక్టర్ 56, సివిల్ ఇంజినీర్ తదితర చిత్రాలు బాక్సాఫీసు పై దాడికి దిగబోతున్నాయి. ఇందులో రెండు మూడు చిత్రాలే ప్రమోషన్స్ చేసి ఆడియన్స్ లో ఆసక్తి ఆకలిగించాయి. మిగతా సినిమాలు కనీసం ప్రేక్షకులకి నోటెడ్ లేని సినిమాలు.

ఇందులో ఎన్ని సినిమాలను ఆడియన్స్ రిజిస్టర్ చేసుకుంటారో.. ఎన్ని సినిమాలు బావున్నాయి అంటారో అనేది రేపు శుక్రవారం ఈసమయానికి తేలిపోతుంది. ఇవే కాకుండా ఓటిటి నుండి కూడా క్రేజీ మూవీస్ విడుదలవుతున్నాయి.

Tomorrow release movies list :

December 9th release movies list
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs