Advertisement
Google Ads BL

పవన్ ప్రచార రధం సిద్ధం


హరి హర వీరమల్లు సెట్స్ లో వీరవిన్యాసాలు చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలంటూ ఏపీ పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2024 ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ జనసేనను ప్రజల్లో బలంగా పాతడానికి బయలుదేరుతున్నారు. దానికి ఓ ప్రచార రథంతో నాంది పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రచార రథానికి ఓ అందమైన పేరు పెట్టి ట్రయిల్ రన్ చేస్తూ ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ ప్రచార రథానికి వారాహి అని పేరుపెట్టినట్టు చెప్పిన పవన్ కళ్యాణ్ ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధమైంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. వారాహి వాహనం చూడడానికి మిలటరీ వాహనంలా కనిపిస్తుంది. కాని అందులో హై సెక్యూరిటీ సిస్టమ్ తో పాటు, ఇంకా చాలారకాల ఫ్యూచర్స్ తో, జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డ్ చేయగల సీసీటీవీ కెమెరాలు, 

అలాగే అత్యాధునిక సౌండ్ సిస్టమ్, ఇంకా రాత్రివేళల్లో పవన్ కళ్యాణ్ నైట్ సభల కోసం లైటింగ్ సిస్టమ్ ను పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. 

ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్ తో పాటుగా సుజిత్ సినిమా, హరీష్ శంకర్ సినిమా సెట్స్ లోకి వెళ్లాల్సి ఉన్నాయి. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అంటూ పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ.

Pawan Kalyan to press Varahi accelerator:

Pawan Kalyan unleashes Varahi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs