Advertisement
Google Ads BL

అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్


బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తాడనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతుండగా.. అటు ప్రభాస్ ఫాన్స్, ఇటు నందమూరి ఫాన్స్, మధ్యలో మెగా ఫాన్స్ కూడా ప్రభాస్ అన్ స్టాపబుల్ రాక కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఈ షోలో ఎలా కనిపిస్తాడో.. ఎలాంటి సీక్రెట్స్ బాలయ్య ప్రభాస్ తో బయటపెట్టిస్తారో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఈ షోకి వచ్చే విషయమై క్లారిటీ లేకపోయినా.. ఏదో నమ్మకం, ఆశ ఆడియన్స్ లో కనిపిస్తుంది.

Advertisement
CJ Advs

అయితే ప్రభాస్ బాలయ్య ఆహా అన్ స్టాపబుల్ షో కి హాజరైనట్లు తెలుస్తుంది. దానితో ప్రభాస్ ఫాన్స్ అన్ స్టాపబుల్ షో జరిగే ప్లేస్ కి చేరుకొని బ్యానెర్లు తో హడావిడి చేసారు. ప్రభాస్ ఆ షో లో పాల్గొంటాడని తెలిసిన ఫాన్స్ ఇలా బ్యానెర్లు తో ప్రభాస్ స్వాగతానికి ఏర్పాట్లు చేసారు. ప్రభాస్ కి స్వాగతం పలికేందుకు పోస్టర్స్ వేసి హంగామా చేసారు. మరి ఈ ఎపిసోడ్ పై అప్పుడే ఆడియన్స్ అంచనాలు పెరిగిపోతున్నాయి. 

ప్రభాస్ తో పాటుగా ఆయన స్నేహితుడు హీరో గోపీచంద్ కూడా ఈ షోకి హాజరైనట్లుగా తెలుస్తుంది. సప్పగా ఉన్న అన్ స్టాపబుల్ షో ని ప్రభాస్ ఎపిసోడ్ ఎంతవరకు లేపుతుందో చూడాలి.

Prabhas in Unstoppable sets:

Fans go wild spotting Balakrishna - Prabhas in Unstoppable sets
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs