Advertisement
Google Ads BL

మహేష్ ఫేస్ లో స్మైల్: హ్యాపీగా ఉన్న ఫాన్స్


మహేష్ బాబు గత రెండు నెలలుగా కుటుంబంలో జరిగిన విషాదాలతో కుంగిపోయారు. తల్లి-తండ్రుల మరణం నెలల గ్యాప్ తో జరగడంతో మహేష్ బాగా డీలా పడిపోయారు. అయితే మహేష్ బాబు వర్క్ మూడ్ లోకి వచ్చినా మహేష్ ని నవ్వు మొహం తో చూడాలని అయన అభిమానులు ఆశపడుతున్నారు. తాజాగా మహేష్ తన మిత్రులు త్రివిక్రమ్, మెహెర్ రమేష్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అలాగే తన భార్య నమ్రతతో కలిసి ముంబై లో ల్యాండ్ అయ్యారు. అక్కడ తన స్నేహితులు ఇంట్లో భోజనం చేస్తున్న ఫొటోస్ ని నమ్రత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Advertisement
CJ Advs

మహేష్ బాబు ప్రస్తుతం మౌంటెన్ డ్యూ యాడ్ షూట్ లో భాగంగా ఆయన ముంబై వెళ్లారు. ముంబై లో నమ్రత-మహేష్ ల ఫ్రెండ్ ఫోటో గ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఇంట్లో భోజనం చేసిన విషయాన్ని నమ్రత పిక్స్ రూపంలో షేర్ చేసింది. ఆ పిక్స్ లో మహేష్ తన స్నేహితులతో కలిసి సంతోషంగా ఉండడం చూసిన ఆయన ఫాన్స్ హ్యాపీ మూడ్ లోకి వెళుతున్నారు. త్రివిక్రమ్-థమన్-మెహెర్ లతో మహేష్ ఆయన వైఫ్ నమ్రత లు అవినాష్ గోవారికర్ ల ఇంట్లో సంతోషంగా గడుపుతూ భోజనం చేస్తూ ఉన్న ఫొటోస్ వైరల్ గా మారాయి.

మహేష్ బాబు నవ్వుతూ అలా తన బాధలు మరిచిపోయి స్నేహితులతో కలిసి ఉండడంతో హమ్మయ్య మహేష్ అన్న మోహంలో కళ, నవ్వు కనిపించాయి. అంతకన్నా ఏం కావాలి అంటూ సంతోషపడిపోతున్నారు వారు.

Finally Mahesh In A Happy Space:

Namrata Shares Mahesh Happy Clicks 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs