బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబో మొదలవడానికి కొన్ని గంటల సమయమే ఉంది. రేపు డిసెంబర్ 8 న పూజా కార్యక్రమాలతో అనిల్ రావిపూడి బాలయ్య సినిమాని అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు. పూజా కార్యక్రమాలతో మొదలయ్యే NBK108 చిత్రం టైటిల్ అనౌన్సమెంట్ కూడా రాబోతుంది. బాలయ్య ని రామారావు గారు గా అనిల్ చూపించబోతున్నట్లుగా టాక్. అఫీషియల్ గా అదే టైటిల్ అనౌన్సమెంట్ రేపు డిసెంబర్ 8 ఉదయం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.
రేపు గురువారం మొదలు కాబోయే NBK108 షూటింగ్ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ లోనే స్పెషల్ గా డిజైన్ చేసిన సెట్స్ లో NBK108 షూటింగ్ చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారు. ఎవరూ చూపించని విధంగా బాలయ్యని కొత్తగా చూపించబోతున్నట్లుగా అనిల్ రావిపూడి చెబుతున్నారు. తండ్రిగా బాలయ్య కేరెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయట. బాలయ్య కి కూతురిగా హీరోయిన్ శ్రీలీల కనిపించబోతుంది. NBK108 ఫస్ట్ షెడ్యూల్ తర్వాత బాలయ్య లుక్ ని అనిల్ రావిపూడి రివీల్ చేసే ఆలోచనలో ఉన్నారట.
ఇక హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పనిచేస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అని మేకర్స్ ఆలోచిస్తున్నారట.