Advertisement
Google Ads BL

ట్రోలర్స్ కి మృణాల్ ఠాకూర్ ఘాటు రిప్లై


సీత రామం మూవీ తో అన్ని భాషల ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అచ్చం పదహారణాల తెలుగింటి ఆడపడుచు లెక్కన కనబడింది. సింపుల్ గా సారీస్ తో, లంగా ఓణీలతో మృణాల్ తెలుగు ప్రేక్షకుల మనసులని దోచేసింది. బాలీవుడ్ సీరియల్ లో హీరోయిన్ కి సిస్టర్ కేరెక్టర్ తో హైలెట్ అయిన ఈ బ్యూటీకి సీతారామం మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. సీతారామం తర్వాత మృణాల్ కెరీర్ కి ఎదురుండదనే అనుకున్నారు. అయితే తెలుగులో అమ్మడిపేరు వినిపించకపోయినా.. మృణాల్ కి హిందీ సినిమాలో ఓ అవకాశం వచ్చింది. 

Advertisement
CJ Advs

హిందీలో ఇషాన్ ఖత్తర్ హీరోగా యుద్ధరంగం నేపధ్యలో తెరకెక్కుతున్న సినిమాలో మృణాల్ కి అవకాశం వచ్చింది. అయితే అది మంచిదేగా అనుకోవచ్చు. కానీ.. ఇషాన్ కి హీరోయిన్ గా కాకుండా సిస్టర్ రోల్ కి మృణాల్ ఓకె చెప్పడంపై నెటిజెన్స్ మృణాల్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీరు ఇషాన్ కి సిస్టర్ గా ఎందుకు ఒప్పుకున్నారు. తర్వాత ఇషాన్ కి జోడిగా నటించరా? అసలు సిస్టర్ కేరెక్టర్స్ చేస్తే మీ క్రేజ్ తగ్గిపోతుంది ఇలా ట్రోల్స్ మొదలు పెట్టారు. దానికి మృణాల్ ఘాటైన రిప్లై ఇచ్చింది. హీరోయిన్ అంటే కేవలం హీరోయిన్స్ గా హీరోల పక్కన మాత్రమే కనిపించాలా.. తల్లి, భార్య, చెల్లి పాత్రలు చేయకూడదా.. ఇలాంటి మూసపద్ధతులకి గుడ్ బై చెప్పినప్పుడే మనలోని సత్తా బయటపడుతుంది.

తర్వాత కెరీర్ లో వెనక్కి చూసుకుంటే అయ్యో మంచి పాత్ర మిస్ అయ్యామనే భావన కలుగకూడదు. నాకు ఆ సినిమాలో సిస్టర్ కేరెక్టర్ నచ్చింది, అందుకే ఒప్పుకున్నాను అంటూ తనపై వస్తున్న ట్రోల్స్ కి చెక్ పెట్టింది మృణాల్. మరి క్రేజీ హీరోయిన్స్ చాలామంది ఇలాంటి సిస్టర్స్, భార్య పాత్రలకి ఒప్పుకోరు. ఏది ఏమైనా మృణాల్ గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Mrunal Thakur Gives Befitting Reply To Trolls:

Mrunal Thakur Gives Befitting Reply To Troll for Sister characters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs