Advertisement
Google Ads BL

జబర్దస్త్ కంటిన్యూ చేస్తా: ఫైమా


జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీమ్ లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫైమా టాప్ కమెడియన్స్ తో సమానమైన కామెడీ పండిస్తూ చాలా త్వరగా ఫెమస్ అయ్యింది. అందం, ఆకర్షణ కాదు టాలెంట్ ముఖ్యం అని ఆ అమ్మాయి ప్రూవ్ చేసింది. భాస్కర్ స్కిట్ లో అందమైన వర్షా కన్నా ఫైమా కామెడికే పడి పడి నవ్వేవారు. ఫైమా జబర్దస్త్ లో ఫెమస్ అవడంతో ఆమెకి భారీగా పారితోషకం ఆఫర్ చేసి బిగ్ బాస్ సీజన్ 6 లోకి తీసుకువచ్చారు. ఇక ఫైమా మొదట కొన్నివారాల్లో కామెడీ చేసి ఆకట్టుకుంది. తర్వాత అబ్బాయిలతో సమానంగా టాస్క్ పెరఫార్మ్ చేస్తూ స్ట్రాంగ్ అయ్యింది. కాకపోతే రేవంత్ విషయంలో ఫైమా కావాలనే గొడవపడిందేమో అనిపించేలా ఆమెని చూపించారు. అలాగే కామెడీ స్థానంలో వెటకారం ప్రవేశించడం, ఇనయతో గొడవ కారణంగా ఆమె క్రేజ్ తగ్గింది. దానితో ఈ వారం ఎలిమినేట్ అయ్యింది.

Advertisement
CJ Advs

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక ఇంటర్వ్యూలో ఫైమా నాకు వెటకారం ఎక్కువైన కారణముగా, రేవంత్ తో గొడవ పడిన కారణంగానే నన్ను ఎలిమినేట్ చేశారంటున్నారు. నేను రేవంత్ ని తిట్టలేదు, వెటకారం కాదు, కామెడీనే అంటూ కవర్ చేసుకుంది. ఇక శ్రీహన్ కూడా వెటకారం చేసాడు. అలాగే మొదట్లో కామ్ గా వున్న శ్రీహన్ ఇప్పుడు అరుస్తున్నాడు అంటుంది. ఈ సీజన్ 6 విన్నర్ ఎవరనగానే ఆది రెడ్డి విన్ అయితే బావుంటుంది అని నాకనిపిస్తుంది అంది. 

ఇక ఫైమాని మీరు బిగ్ బాస్ తర్వాత జబర్దస్త్ కంటిన్యూ చేస్తారా అని అడగ్గానే.. హా చేస్తాను అంది. మరి జబర్దస్త్ లోకి వెళ్లాలంటే బిగ్ బాస్ అగ్రిమెంట్ రూల్స్ పాటిస్తూ  ఓ ఏడాది స్టార్ మా లోనే కామెడీ చేసుకోవాలి ఫైమా. చూద్దాం ఫైమా మళ్ళీ జబర్దస్త్ లోకి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందో అనేది.

Jabardasth will continue: Faima:

Faima Re Entry in Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs