Advertisement
Google Ads BL

రశ్మికపై బ్యాన్: నష్టపోయేది మీరే


ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కి అవకాశాలు ఇవ్వడానికి అన్ని భాషల ఇండస్ట్రీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే  తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న రష్మిక కి ఎన్టీఆర్ 30, RC16 లో అవకాశాలు వచ్చేలా కనబడుతున్నాయి. మరోపక్క తమిళ్ లో విజయ్ వారిసు హిట్ అయితే.. అక్కడ జెండా పాతడానికి రెడీ అవుతుంది రష్మిక. అలాగే హిందీలో క్రేజి ప్రాజెక్టులతో బిజీ గా మారిన రశ్మికని కన్నడ పరిశ్రమ బ్యాన్ చెయ్యొచ్చనే ఊహాగానాలు నడుస్తున్నాయి.

Advertisement
CJ Advs

ఇంత క్రేజ్ ఉన్న అమ్మాయిని బ్యాన్ చేస్తే నష్టపోయేది మీరే అంటున్నాడు ఓ దర్శకుడు. గుర్తుందా శీతాకాలం డైరెక్టర్ ని రశ్మికపై కన్నడలో బ్యాన్ విధించబోతున్నారట నిజమేనా అని అడగగా.. రశ్మికకి కన్నడ ఇండస్ట్రీకి మధ్యన ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు. మేము ఓ సినిమా అవకాశం ఇచ్చాం కదా అని ఎప్పటికి మన భజనే చెయ్యరు. నేను గతంలో సంజు వెడ్స్ గీత సినిమాలో చాలామంది నటులకి ఛాన్స్ ఇచ్చాను, వాళ్లంతా పెద్ద నటులు అయ్యాక మనల్ని గుర్తు పెట్టుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. కృతజ్ఞత చూపించాలా, వద్దా అన్నది వాళ్ళ ఇష్టం, మనం కోరుకోకూడదు.

ఇక ఒకరిని బ్యాన్ చెయ్యాలంటే అది పరిశ్రమకే నష్టం కానీ ఆమెకి కాదు, ఆమె పలు భాషల్లో సినిమాలు చేసుకుంటుంది. ఆమె క్రేజ్ వాడుకోకపోవడం మన తప్పవుతుంది. సో నేను ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యను అంటూ శీతా కాలం డైరెక్టర్ నాగశేఖర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Gurthunda Seethakalam Director Stands In Support Of Rashmika!:

Gurthunda Seethakalam Director NagaShekar About Ban On Rashmika Mandanna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs