Advertisement
Google Ads BL

హిట్ 2 ని ఎంజాయ్ చేసిన మోక్షజ్ఞ


బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ పబ్లిక్ లోకి పెద్దగా రాడు. బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ పై నందమూరి ఫాన్స్ ని ఊరిస్తూనే ఉన్నారు. గత మూడేళ్ళుగా మోక్షజ్ఞ ఎంట్రీ నందమూరి ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈమధ్యన వీర సింహ రెడ్డి సెట్స్ లో బాలయ్య బర్త్ డే వేడుకల్లో మోక్షజ్ఞ కనిపించగా ఫాన్స్ ఎగ్జైట్ అయ్యారు. తాజాగా మోక్షజ్ఞ తన తండ్రి బాలయ్య తో కలిసి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో హిట్ 2 సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యడం నందమూరి అభిమానులని విశేషంగా ఆకర్షించింది.

Advertisement
CJ Advs

అడివి శేష్ హీరోగా నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్ 2 మూవీ గత శుక్రవారమే విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాని, శేష్, దర్శకుడు శైలేష్ కొలను బాలయ్య కోసం ప్రసాద్ లాబ్స్ లో హిట్ 2 స్పెషల్ షో వేశారు. ఈ షో చూసాక బాలయ్య నాని, అడివి శేష్ లతో సెల్ఫీలు దిగుతూ హడావిడి చెయ్యగా.. మోక్షజ్ఞ హిట్ 2 చూసి బయటికి వచ్చాక తాను సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్యానని, సినిమాని ఎంజాయ్ చేశానని, మైండ్ బ్లోయింగ్ అంటూ హిట్ 2 టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇక మోక్షజ్ఞ హిట్ 2 చూసి ఎంజాయ్ చెయ్యడం ఎలా ఉన్నా.. ఆయన ఇలా పబ్లిక్ లోకి వచ్చి సినిమా చూసి.. ఎంజాయ్ చేయడాన్ని నందనమూరి ఫాన్స్ చాలా సంతోషంగా ఫీలవుతున్నారు. ఇక హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చేస్తే.. మాకు అంతకన్నా కావాల్సిందేముంది అంటూ వారు మోక్షజ్ఞని ఎంత త్వరగా హీరోగా చూసెయ్యాలనే ఆత్రుతని చూపిస్తున్నారు.

Balakrishna, his son Mokshagna enjoys HIT 2 movi:

Balakrishna With His Son Mokshagna Watched HIT2 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs