Advertisement
Google Ads BL

సమంత ఖుషీలో కృతి శెట్టి?


సమంత మాయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుసుకుంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. ఆమె ఎప్పటికి పూర్తిగా కోలుకుని ప్రేక్షకుల ముందుకు వస్తుందో ఓ క్లారిటీ లేదు. దానితో ఆమె నటించాల్సిన ఖుషి మూవీ షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ కి జోడిగా నటిస్తున్న సమంత ఆరోగ్యం కారణంగా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఖుషి షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. అటు విజయ్ దేవరకొండ ఖాళీ అయ్యాడు, ఇటు నిర్వాణ ఫ్రీ అయ్యాడు.

Advertisement
CJ Advs

అయితే ఖుషి లో సమంత మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కి స్కోప్ ఉందట. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకమని, మొదట్లో  కాస్త నెగెటివ్ షేడ్స్ తో కనిపించినా ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి.. ఆ పాత్ర ఎమోషనల్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఉంటుందట. ఇప్పుడు ఆ పాత్రకి కృతి శెట్టి అయితే బావుంటుంది అని.. దర్శకుడు ఆమెని సంప్రదించేపనిలో ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. అదే నిజమైతే కృతి శెట్టి లక్కీనే. ఎందుకంటే విజయ్ దేవరకొండ తో క్రేజీగా కొన్ని సీన్స్ లో కనిపించినా ఆమెకి హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం.

Krithi Shetty To Play Key Role In Kushi Movie:

Krithi Shetty to feature with Vijay Deverakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs