బిగ్ బాస్ సీజన్ 6 13వ వారంలో ఎలిమినేట్ అయిన ఫైమా అసలు తాను టాప్ 5 లో ఉంటానని అనుకున్నప్పటికీ.. గీతూ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాక ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా గేమ్ మీద ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్లుగా ఆమె ఎలిమినేషన్ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. కానీ ఎక్కడో ఫైమాకి కాన్ఫిడెన్స్ ఉంది, ఫైమా గత వారం తాను ఎలిమినేట్ అవ్వననే ఉద్దేశ్యంతో ఎవిక్షన్ ప్రీ పాస్ వాడుకోవడానికి సిద్దమవ్వలేదు. కాని నాగార్జున ఒప్పించిన కారణంగా ఆమె మరో వారం హౌస్ లోనే ఉంది.. లేదంటే ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఆమె గత వారమే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది.
ఇక ఫైమా ఎలిమినేషన్ కి కారణాలుగా తన వెటకారమని, రేవంత్ ని తిట్టిన కారణంగానే ఆమె ఎలిమినేట్ అయ్యింది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటుంది. రేవంత్ ని తాను తిట్టలేదని, కానీ అలా చూపించారంటూ మాట్లాడిన ఫైమాని బిగ్ బాస్ విన్నర్ ఎవరతారనుకుంటున్నారు, ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన చాలామంది రేవంత్ ఖచ్చితంగా విన్నరవుతాడని అంటున్నారు అనగానే నా మనసులో మాత్రం ఆది రెడ్డి విన్నర్ అవ్వాలని ఉంది అంటూ తన మనసులోని మాట బయటపెట్టింది.
గీతూ రాయల్ ఎలిమినేట్ అయ్యాక ఫైమా ఆది రెడ్డి ఫ్రెండ్లీ గా ఉంటున్నారు. అయితే ఫైమా ఎలిమినేట్ అయ్యాక రేవంత్ పై సంచలన కామెంట్స్ చేసింది. రేవంత్ డబుల్ స్టాండెడ్స్ లో మాట్లాడతాడు, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను.. కానీ రేవంత్ ని నేను ఏమి తిట్టలేదు, టాస్క్ లో భాగమే అంటూ తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది.