Advertisement
Google Ads BL

రానాకి కాలింది-ఇండిగోకి మూడింది


దగ్గుబాటి రానా బాహుబలి తో పాన్ ఇండియా హిట్ కొట్టిన తర్వాత హిందీలో బిజీ అయ్యారు. విరాట పర్వం మూవీ తర్వాత రానా నాయుడు వెబ్ సీరీస్ లో నటించాడు. అయితే రానా తాజాగా ఇండిగో విమానయాన సంస్థ పై విరుచుకుపడ్డాడు. ఇండిగో విమానాయ సంస్థ చెత్త సర్వీస్ అంటూ రానా వరస ట్వీట్స్ తో సదరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చెయ్యడం హైలెట్ అయ్యింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. రానా తాజాగా హైదరాబాద్ నుండి తన ఫ్యామిలీతో బెంగుళూర్ వెళ్లారు.

Advertisement
CJ Advs

ఆయన తన ఫ్యామిలీతో బెంగుళూర్ వెళ్ళడానికి శంషాబాద్ విమానాశ్రయంలో చెక్ ఇన్ అయ్యాక ఫ్లైట్ లేట్ అంటూ ఇండిగో సంస్థ ప్రకటించింది. తర్వాత రానా ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ వేరే విమానంలో బెంగుళూర్ కి వెళ్లారు. అక్కడ బెంగుళూర్ లో ఫ్లైట్ దిగాక వాళ్ళ లగేజ్ కోసం వెయిట్ చేసి సిబ్బందిని అడగగా.. వారు లగేజ్ ఇంకా రాలేదు, వేరే ఫ్లైట్ లో వస్తుంది అని సమాధానం చెప్పడంతో రానాకి కాలింది. ఆ విసుగు, కోపంతో ఇండిగో సంస్థపై ట్విట్టర్ లో నిప్పులు చెరిగాడు.

ఇండియాలో ఇప్పటివరకు ఇండిగో అంత చెత్త విమానయాన సంస్థ లేదు, ఫ్లైట్ టైమింగ్స్ ఎవరికీ తెలియదు, లగేజ్ గురించి చెప్పరు. సిబ్బందిని అడిగితే తెలియదు అంటారు. ఇంతకన్నా చెత్త ఇంకేమి ఉండదు.. అంటూ రానా ఇండిగో విమానాయ సంస్థని టాగ్ చేస్తూ ట్విట్టర్ లో సిబ్బందిని దులిపేసాడు.

Rana Daggubati Fires Indigo Airlines On Twitter:

Rana Daggubati fires on IndiGo Airlines for missing his luggage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs