Advertisement
Google Ads BL

ఆత్మహత్య చేసుకుందామనుకున్న హీరోయిన్


చాలామంది నటులు కెరీర్ లో ఒడిడుకులు ఎదుర్కొన్నప్పుడు జీవితాన్ని చాలించాలని, నలుగురిలో తిరగలేక డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలామంది నటులు డిప్రెషన్ కి లోనై చనిపోయినవారు ఉన్నారు. అలాగే డిప్రెషన్ కి లోనై డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ సక్సెస్ అయినవారు ఉన్నారు. కానీ కొంతమంది ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం తెలియక సూయిసైడ్ చేసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఒకరు టెర్రస్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. ఆమె నందిని రాయ్. తెలుగులో ఆమె నటించిన చిత్రాలేవీ సక్సెస్ అవ్వక ఒకొనొక టైం లో ఇలాంటి సూయిసైడ్ థాట్స్ వచ్చాయని చెబుతుంది ఆమె. కెరీర్ ఆరంభంలో తాను నటించిన సినిమాలేవీ ఆడకపోవడంతో డిప్రెషన్ కి లోనై మానసికంగా కుంగిపోయి ఇంటి టెర్రస్ పై నుండి దూకి చనిపోదామనుకున్నాను, కానీ తర్వాత చనిపోయి సాధించేదేం ఉండదు అని ధైర్యం తెచ్చుకుని రోజూ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మెల్లిగా మాములు మనిషిని అయ్యాను.

హిట్, ప్లాప్ అనేది మన కెరీర్ ని డిసైడ్ చేయవని తెలుసుకుని మళ్ళీ నా ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఏ సమస్య వచ్చినా తట్టుకుని నిలబడడం నేర్చుకున్నాను అంటూ నందిని రాయ్ ఎందుకు చనిపోవాలనుకుందో చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ ఈమధ్యన గ్లామర్ షో విషయంలో రెచ్చిపోతుంది. మరి ఈ అందాలు అవకాశాలు కల్పిస్తాయేమో అని ఆశపడుతోంది. 

Nandini Rai opens up on her struggle with depression:

Nandini Rai reveals her fight with depression
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs