Advertisement
Google Ads BL

ఆదివారం పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పండగే


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్ లో బిజీగా వున్నారు. దర్శకుడు క్రిష్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న పవన్ ప్రస్తుతం హరి హార వీరమల్లు పైనే ఫోకస్ పెడతారనుకుంటే.. ఆయన మరో రెండు సినిమాలను అనౌన్స్ చెయ్యబోతున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి మూవీస్ అనౌన్సమెంట్ వచ్చి హోల్డ్ లో ఉన్నాయి. 

Advertisement
CJ Advs

మధ్యలో సముద్రఖని డైరెక్షన్ లో రీమేక్ చెయ్యాలి అది ఇంకా అనౌన్సమెంట్ లేదు. అలాగే సుజిత్ తో పవన్ కళ్యాణ్ మూవీ చేస్తారనే ప్రచారము ఉంది. ఫైనల్లీ సుజిత్ - పవన్ కళ్యాణ్ కాంబో ఫిక్స్ అవడమే కాదు, దేవ్ ఎంటర్టైన్మెంట్ లో తెరకెక్కబోయే ఈ మూవీ అనౌన్సమెంట్ రేపు అంటే డిసెంబర్ 4 న రాబోతున్నట్టుగా ప్రకటించారు. డిసెంబర్ 4 ఆదివారం ఉదయం 8.55 నిమిషాలకి ముహూర్తం పెట్టారు. అలాగే హరీష్ శంకర్ తో పవన్ చెయ్యబోయే మూవీ ప్రీ ప్రొడక్షన్ పై కూడా రేపే అప్ డేట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది.

హరి హర వీరమల్లు షూటింగ్ ఫినిష్ అవ్వగానే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ అలాగే సుజిత్ తో చెయ్యబోయే మూవీ సెట్స్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. మరి ఒకటి కాదు రెండు బిగ్ అప్ డేట్స్ పవన్ కళ్యాణ్ నుండి ఆదివారం రాబోతున్నాయని తెలిసి పవన్ ఫాన్స్ అలెర్ట్ అవుతూ అప్పుడే పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

Pawan Kalyan will take up two more projects:

Pawan Kalyan new film announcement coming up tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs