బాలీవుడ్ లో పెళ్లి చేసుకోకపోయినా.. బోలెడన్ని ఎఫ్ఫైర్స్ నడిపి, హీరోయిన్స్ తో డేటింగ్ చేసాడు హీరో సల్మాన్ ఖాన్. ఐశ్వర్య రాయ్ దగ్గర నుండి కత్రినా కైఫ్ వరకు ఎవ్వరినీ వదల్లేదు. ఈ డేటింగ్స్, సహజీవనాలు అంటే ఇంట్రెస్ట్ చూపించే సల్మాన్ ఖాన్ మాత్రం ఇంతవయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే తాజగా సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి పాకిస్తానీ బ్యూటీ సోమి సల్మాన్ ఖాన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. సోని అలీ-సల్మాన్ ఖాన్ ప్రేమ అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనం.
వీరిద్దరూ వివాహం చేసుకుంటారనుకున్న టైమ్ లో సోని అలీ సల్మాన్ ఖాన్ కి బ్రేకప్ చెప్పేసి సినిమాలనే వదిలేసి అమెరికా వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ ఇన్నాళ్ళకి సల్మాన్ ఖాన్ తో డేటింగ్ లో ఉన్నప్పుడు తనకి ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. సల్మాన్ ఖాన్ ఆడవాళ్ళని వేధిస్తాడు. అతడు పిరికిపంద, సిగరెట్లతో కాలుస్తాడు, వేధిస్తూ పైశాచికానందం పొందుతాడు అంటూ సోని అలీ చేసిన ఇన్స్టా పోస్ట్ చాలా త్వరగా డిలేట్ చేసింది.
కానీ అప్పటికే సోని అలీ సల్మాన్ ఖాన్ పై చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. అసలు ఆమె ఇలాంటి ట్వీట్ ఎందుకు చేసింది. ఆ తర్వాత ఎందుకు అంత త్వరగా డిలేట్ చేసిందో ఎవరికీ అర్ధం కాలేదు.