Advertisement
Google Ads BL

గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రివ్యూ


రీసెంట్ గానే గాడ్ ఫాదర్ లో జయదేవ్ గా నెగెటివ్ కేరెక్టర్ లో 100 కి 100 మార్కులు కొట్టేసి, విమర్శకుల ప్రశంశలు అందుకుని, అందరితో శెభాష్ అనిపించుకున్న హీరో సత్యదేవ్.. టాప్ హీరోయిన్ మిల్కిబ్యూటీ తమన్నా తో కలిసి మరోసారి ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. సత్యదేవ్-తమన్నా కానుకలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలం వచ్చే శుక్రవారం అంటే డిసెంబర్ 9న ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమాలోని ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు మంచి అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

మన  జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము అటువంటి జ్ఞాపకాలను ఈ చిత్రం మరోసారి గుర్తుచేస్తుంది. లవర్ గా, రొమాంటిక్ గా సత్య దేవ్ కొత్తగా కనిపించాడు. కావ్య శెట్టి-సత్య దేవ్ ట్రాక్ బావుంది. మేఘ ఆకాష్ అలా కనిపించి ఇలా మాయమైనా అందంగా కనిపించింది. ఇక తమన్నా అమాయకపు ప్రేమికురాలిగా, భార్యగా ఆకట్టుకుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ట్రైలర్ అద్భుతమైన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ లో కాల భైరవ అందించిన సంగీతం మనసును మైమరిచిపోయేలా చేస్తుంది మరియు లక్ష్మీ భూపాల్ కవితాత్మక  డైలాగ్‌లు ట్రైలర్ లో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

Gurtunda Seetakalam Trailer Review:

Satya Dev Gurtunda Seetakalam Trailer is out 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs