రీసెంట్ గా అలీ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఆయన కూతురు ఫాతిమా వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లో పెళ్లి వేడుక, గుంటూరులో రెసెప్క్షన్ వేడుకని ఘనంగా నిర్వహించింది అలీ ఫ్యామిలీ. అలీ కూతురు పెళ్ళిలో మెగాస్టార్ చిరు దగ్గర నుండి వెంకీ, నాగార్జున, ఇలా చాలామంది సెలబ్రిటీస్ పాల్గొన్నారు. మంత్రి రోజా కూడా వచ్చారు. ఇక రిసెప్షన్ కి ఏపీ సీఎం జగన్ గారు గుంటూరు వెళ్లి నూతన వధూవరలని ఆశీర్వదించారు. ఇంత జరిగినా అలీ స్నేహితుడు, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అలీ ఇంట్లో జరిగిన శుభ కార్యంలో కనిపించక పోవడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్ అలీకి స్నేహితుడు. మరి పెళ్ళికి పిలవలేదా, పిలిచినా పవన్ రాలేదా.. అనే చర్చలు జరిగాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్-అలీ లు రాజకీయంగా ప్రత్యర్థులుగా మాటాల తూటాలు పేల్చుకోవడంతో పవన్ అలిగారని అనుకున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ కి అలీ తన కూతురు వివాహనికి ఆహ్వానం అందించారట. పవన్ కూడా వస్తా అన్నారట. పెళ్ళికి తప్పకుండా వస్తానని మాటిచ్చారట. కానీ పవన్ కళ్యాణ్ రాలేకపోయినట్టుగా అలీ గారు స్వయంగా చెబుతున్న మాట. పవన్ కళ్యాణ్ తన కూతురు ఫాతిమా వివాహానికి ఎందుకు రాలేకపోయారో అని అజరుగుతూన్న చర్చలకు తెరదించారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పెళ్ళికి వస్తాను అన్నారు, కానీ ఆయన ఫ్లైట్ మిస్ అవడం వలన పెళ్ళికి రాలేకపోయారు.
నాకు ఫోన్ చేసి పెళ్లి, రిసెప్షన్ ఎలా జరిగింది అని అడగడమే కాదు, వధూవరులు ఇంట్లో ఉన్నప్పుడు చెబితే ఆయన మా ఇంటికి వచ్చి కొత్త జంటని ఆశీర్వదిస్తాను అని చెప్పారంటూ అలీ పవన్ కళ్యాణ్ తన ఇంటికి రాబోతున్న విషయాన్ని చెప్పారు.