Advertisement
Google Ads BL

అందరికీ షాకిచ్చిన బాలయ్య కుమార్తె..!


నందమూరి నటసింహం బాలయ్య తనయ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి గురించి తెలియని వారుండరు. వ్యాపార రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆమె సంపాదించుకుని.. హెరిటేజ్ ఫుడ్స్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా.. మగవారికి ఏ మాత్రం తీసిపోని విధంగా దూసుకెళుతోంది. ఒక్క వ్యాపార రంగమే కాకుండా.. ఆమెలో మరో టాలెంట్ కూడా ఉందని చాటి చెబుతూ.. హిమాలయాల్లో బైక్ రైడ్ చేస్తూ బ్రాహ్మణి అందరికి షాకిచ్చింది. ధైర్యానికి మారు పేరు.. ఈ నారా వారి కోడలు.. అనేలా మాట్లాడుకునేలా చేసింది. 

Advertisement
CJ Advs

 

ఇటీవల యంగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్(YPO) ద లఢక్ క్వెస్ట్ పేరుతో నిర్వహించిన బైక్ రైడ్‌లో నారా బ్రాహ్మణి కూడా పాల్గొంది. ఈ ఆర్గనైజేషన్‌కు యువ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఈవోలు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ బైక్ రైడ్‌కి సంబంధించిన జావా యెడ్జి మోటార్ సైకిల్స్ అనే సంస్థ.. ఓ షార్ట్ ఫిలింని రూపొందించింది. అత్యంత ప్రమాదకరమైన మౌంటైన్స్ వద్ద కూడా ఎంతో సునాయాసంగా బైక్ రైడ్ చేస్తూ యంగ్ పారిశ్రామిక వేత్తలను ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ రైడ్ గురించి నారా బ్రాహ్మణి ఏం చెప్పిందంటే... ఇప్పుడు సమయం 6:30 గంటలైంది. లఢక్ చాలా అద్భుతంగా, ఎంతో అందంగా ఉంది. ధక్ సే ఆరామానికి బయలుదేరుతున్నాం. స్వచ్ఛమైన ఆధ్యాత్మిక భావనని అందుకోనున్నాం. అక్కడ ధ్యానం చేస్తాం... అని తెలిపింది. ఈ వీడియోలో రైడ్‌లో పాల్గొన్న వారంతా తమ తమ మనోభావాలను, అనుభవాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Nara Brahmani Bike Riding Video goes viral:

Nara Brahmani gives shock with Bike Riding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs