Advertisement
Google Ads BL

అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో ఓటిటి డేట్


అల్లు శిరీష్ లేటెస్ట్ హిట్ చిత్రం ఉర్వశివో రాక్షసివో ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. గత నెలలో విడుదలైన ఈ సినిమా ని రాకేష్ శశి డైరెక్ట్ చెయ్యగా గ్లామర్ బ్యూటీ అను ఇమ్మాన్యువల్ హీరోయిన్ గా నటించింది. ఊర్వశివో రాక్షసివో సినిమా ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం డిసెంబ‌ర్ 9 నుంచి ఆహాలో ప్రీమియర్ కానుంది. 

Advertisement
CJ Advs

శ్రీకుమార్ (అల్లు శిరీష్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఐటీ ఉద్యోగి. మ‌ధ్య త‌ర‌గ‌తివాడు కావ‌టంతో కొన్ని క‌ట్టుబాట్ల‌తో పెరుగుతాడు. త‌ల్లిదండ్రుల‌తో చాలా స‌న్నిహితంగా ఉంటాడు శ్రీకుమార్‌. ముఖ్యంగా త‌ల్లి (ఆమ‌ని)తో అత‌నికి మంచి అనుబంధం ఉంటుంది. అత‌నికి మంచి పిల్ల‌ను చూసి పెళ్లి చేయాల‌ని త‌ల్లిదండ్రులు అనుకుంటుంటారు. అయితే శ్రీకుమార్ మాత్రం సింధుజ (అను ఇమ్మాన్యుయేల్‌)తో ప్రేమ‌లో ప‌డతాడు. ఆమె కూడా శ్రీకుమార్ కంపెనీలోనే ప‌ని చేస్తుంటుది. ఆమె అధునికి భావాలున్న అమ్మాయి. జీవితంలో కొన్ని నిర్దిష్ట‌మైన ల‌క్ష్యాల‌ను క‌లిగి ఉంటుంది. దీంతో శ్రీకుమార్ ఆమెతో పెళ్లి ప్ర‌తిపాద‌న తెచ్చిన‌ప్ప‌టికీ ఆమె లివ్ ఇన్ రిలేష‌న్ వైపుకే మొగ్గు చూపుతుంది. మ‌రి ఇంత  విరుద్ధ‌మైన భావాలున్న వారిద్ద‌రూ ఒక‌టిగా క‌లుస్తారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ఈ సంద‌ర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ప్రస్తుత కాలానికి చెందిన అమ్మాయి, అబ్బాయికి చెందిన ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. నేటి త‌రం యువ జంట‌లు ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇలాంటి సినిమాను ఆహా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టం చాలా సంతోషంగా ఉంది.. అన్నారు.

Urvasivo Rakshasivo on 9th December:

aha to stream world digital premiere of Urvasivo Rakshasivo on 9th December
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs