Advertisement
Google Ads BL

నమ్రత పేరుతో మహేష్ రెస్టారెంట్ బిజినెస్


సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటిస్తూనే వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమాల్లో నటించడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మహేష్ వంతు. మహేష్ వ్యాపారాలను మానేజ్ చేసేది ఆయన భార్య నమ్రత. మహేష్ బాబు నటిస్తూ కూల్ గా సినిమాలు చేస్తున్నారంటే ఆయన భార్య నమ్రతనే కారణం. పలు వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఆవిడ. ఇక ఏషియన్ సునీల్ వాళ్లతో కలిసి AMB మల్టిప్లెక్స్ లో భాగస్వాములైన మహేష్ బాబు ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ లోకి దిగారు.

Advertisement
CJ Advs

హైదరాబాదు సిటీలో ఏషియన్స్ వారితో కలిసి మహేష్ తన భార్య నమ్రత పేరు మీదగా AN(ఏషియన్స్, నమ్రత)రెస్టారెంట్ ప్రారంభించారు. అన్ని వసతులతో కూడిన ఈ రెస్టారెంట్ పూజా కార్యక్రమాలు డిసెంబర్ 8 న జరగనున్నాయి. మహేష్ తల్లితండ్రులు ఈ మధ్యనే మరణించడంతో మహేష్-నమ్రతలు పూజా కార్యక్రమాలకు దూరంగా ఉంటారని.. ఏషియన్స్ వారు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఈ రెస్టారెంట్ గ్రాండ్ గా ప్రారంభిస్తారని తెలుస్తుంది.

Mahesh Babu new restaurant open on:

Namrata-Asian AN restaurant opening
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs