Advertisement
Google Ads BL

మహేష్ కొడుకు హాలివుడ్ స్టార్


సూపర్ స్టార్ గా మహేష్ బాబు ని ఆరాధించే అభిమానులు కోకొల్లలు, తన తండ్రి కృష్ణగారి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని హీరోగా సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మహేష్ బాబు.. టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టడానికి సిద్దమవుతున్నాడు. ఈమధ్యనే తండ్రి కృష్ణగారి మరణం నుండి కోలుకుంటున్న మహేష్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నారు. అయితే మహేష్ కొడుకు గౌతమ్ కూడా మహేష్ అంతటి అందగాడు. గౌతమ్ ఎక్కడ కనబడినా మహేష్ కన్నా హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడే అని మాట్లాడుకుంటారు. 

Advertisement
CJ Advs

ప్లస్ వన్ లోకి అడుగుపెట్టిన గౌతమ్ తన హై స్కూల్ లో ఓ థియేటర్ ప్రదర్శన ఇచ్చాడు. గౌతమ్ క్రిష్ట్మస్ వేడుకల్లో భాగంగా హై స్కూల్ లో జరిగిన ఓ థియేటర్ ప్రదర్శనలో హీరోగా నటించాడు. ఆ ప్రోగ్రాంలో గౌతమ్ ని చూస్తుంటే అచ్చం మహేష్ బాబులా కనిపించాడు. సైడ్ లుక్స్, ఆ హైట్, అన్ని అచ్చం మహేష్ లానే ఉన్నాయి. గౌతమ్ థియేటర్ ప్రదర్శన వీడియో ని నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ప్రేమలో నైపుణ్యం లేదు కానీ, ప్రేమించే స్నేహితులు ఉన్నారు. గౌతమ్ హై స్కూల్ లో ఇచ్చిన మొట్ట మొదటి థియేటర్ ప్రదర్శన ఇది, గౌతమ్ అదరగొట్టేశావ్, నీ స్టయిల్ తో నీ నటనతో, నాకెంతో గర్వంగా ఉంది అంటూ నమ్రత ఆ వీడియో తో పాటుగా పోస్ట్ చేసింది.

ఆ వీడియో చూసిన మహేష్ అభిమానులు.. మహేష్ అన్నా నీ కొడుకు హాలీవుడ్ స్టార్ ని తలపిస్తున్నాడు. నువ్వు సూపర్ స్టార్ వి అయితే గౌతమ్ నీ నట వారసత్వంలో హాలీవుడ్ కి వెళ్ళిపోతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నాడు.

Namrata Shirodkar proud of her son performance:

Mahesh Babu son Goutham shows his acting prowess
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs