Advertisement
Google Ads BL

రేవంత్ కి ఫేవర్ చేస్తున్న బిగ్ బాస్


బిగ్ బాస్ సీజన్ 6 లో టైటిల్ ఫెవరెట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన సింగర్ రేవంత్ మాటలు వెనుకాముందు ఆలోచించకుండా వదిలేస్తాడు అనే విషయంలోనే కానీ, మిగతా విషయాలన్నిటిలో హౌస్ మేట్స్ అందరిలో నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉన్నాడు. నోరు జారే విషయంలో నాగార్జున చేత తిట్లు తిని, మిగతా హౌస్ మేట్స్ తో నామినేషన్స్ వేయించుకుంటున్న రేవంత్ టాస్క్ లోకి దిగాడంటే ఎదుటి వారి గుండెలు గుభేల్ మనిపించేలా గేమ్ ఆడతాడు. సీజన్ 6 లో బలమైన కంటెస్టెంట్ గా రేవంత్ కనిపించడం కాదు, చాలామంది రేవంత్ విన్నర్ అవుతాడని ఒప్పుకుంటున్నారు. అయితే ప్రతి వారం ఎలిమినేట్ అయ్యి యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇస్తున్న కంటెస్టెంట్స్ మాత్రం రేవంత్ కి బిగ్ బాస్ ఫెవర్ చేస్తున్నాడనే మాట మాట్లాడుతున్నారు.

Advertisement
CJ Advs

అందుకే రేవంత్ కి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నారంటూ కామెంటు చేస్తున్నారు. హౌస్ లో కూడా ఫైమా ఎప్పుడు రేవంత్ ని టార్గెట్ చేసినా రేవంత్ చేసే పనులు ఎందుకు చూపియ్యరు. రేవంత్ మాట్లాడే మాటలు బయటికి చూపించారా అంటూ కెమెరాలతో గొడవపెడుతుంది. అంటే రేవంత్ కి టైటిల్ వస్తుంది అనే కుళ్లుతో చాలామంది మాట్లాడుతున్నారు. మాట తీరు మార్చుకున్నా.. మాట తీరు బాగోకపోయినా రేవంత్ ఎవరిని మోసం చెయ్యలేదు, అతని ఆట ఆటను ఆడుతున్నాడు. మాట విషయంలో అతన్ని వెనకేసుకురావడం లేదు, ప్రతిసారి ఆ విషయంలో నాగార్జున గారే రేవంత్ కి క్లాస్ పీకుతున్నారు.. 

టాప్ 5 లో రేవంత్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. కానీ టైటిల్ విషయంలో రేవంత్ కి ఇప్పుడు ఇనాయ, రోహిత్ నుండి గట్టి పోటీ మొదలైంది. ఎనిమిది వారాలుగా రేవంత్ కి ఇనాయకి మధ్యన పోటాపోటీ క్రేజ్ ఉంది, ఇప్పుడు అనూహ్యంగా రోహిత్ కూడా రేవంత్ కి పోటీగా కనబడుతున్నాడు. టాస్క్ విషయంలో స్ట్రాంగ్, అలాగే మాట విషయంలో స్మూత్ గా అందరి మనసులని గెలిచిన రోహిత్ ఇప్పుడు టైటిల్ ఫెవరెట్ గా మారుతున్నాడు. సో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ విషయంలో అప్పుడే ఓ అంచనాకు రాలేమని అనిపిస్తుంది.

Bigg Boss is favoring Revanth:

Bigg Boss Telugu 6: BB King Revanth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs