Advertisement
Google Ads BL

త్రివిక్రముడి కొత్త లగ్జరీ కారు కబుర్లు


త్రివిక్రమ్ శ్రీనివాస్ కి హీరోల తో పాటు సమానమైన క్రేజ్ ఉంటుంది. దర్శకుడిగానే కాదు, రైటర్ గా ఆయనకి ఓ వర్గం ఆడియన్స్ వీరాభిమానులు ఉన్నారు. ఆయన మాటలు రాసిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలు ఎన్నిసార్లు చూసినా ఇప్పటికి ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. ఇక అతడు, ఖలేజా, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది ఇలా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా థియేటర్స్ లోనే కాదు, బుల్లితెర మీదా హిట్టయ్యాయి. కొన్ని సినిమాలు ఒకటి రెండుసార్లు చూస్తే మొహం మొత్తేస్తుంది. కానీ త్రివిక్రముడు సినిమాలు చూసేకొలదీ చూడాలనిపిస్తాయి తప్ప బోర్ కొట్టవు. అందుకు ఉదాహరణలు జల్సా, ఖలేజా, అతడు సినిమాలే.

Advertisement
CJ Advs

అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మహేష్ తో SSMB28 చేస్తున్నారు త్రివిక్రమ్. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ మధ్యనే మొదలయ్యింది. మధ్యలో మహేష్ తల్లితండ్రులు కాలం చెయ్యడంతో షూటింగ్ వాయిదా పడింది. ఈ మధ్యలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ యాడ్ షూట్ చేసి వచ్చారు. ఇంత బిజీగా వుండే త్రివిక్రమ్ తాజాగా కొన్న ఓ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ బీఎండబ్ల్యూ కారు కొని అది డెలివరీ తీసుకుంటున్న ఫొటో ఒకటి సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బీఎండబ్ల్యూ కారు మోడల్ క్లారిటీ లేకపోయినా.. ఆ కారు ధర కోటిపైనే ఉంటుంది అని నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు. 

త్రివిక్రమ్ కొన్న కారు చాలా లగ్జరీ గా ఉంటుంది, అందులో అద్భుతమైన ఫ్యూచర్స్ ఉంటాయని తెలుస్తుంది. త్రివిక్రమ్ ఆయన భార్య తాము కొన్న లగ్జరీ కారు డెలివరీ తీసుకుంటున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Trivikram Srinivas gets his new luxury car:

Director Trivikram Srinivas Bought New Luxury Car
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs