Advertisement
Google Ads BL

ఆ హీరోలకి పెరిగిపోతున్న టెన్షన్


ఇప్పుడు టాలీవుడ్ లో ముగ్గురు హీరోలు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇంకో తమిళ్ హీరోలోనూ టెన్షన్ పెరిగిపోతుంది. సినిమాల్లో హీరోలుగా నటించిన వారు ఇద్దరైతే.. ఆ సినిమాలని నిర్మించినవారు మరో ఇద్దరు హీరోలు. వారే నాని, రవి తేజ, అడివి శేష్, విష్ణు విశాల్. నాని నిర్మాతగా అడివి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్2, రవితేజ నిర్మాతగా విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన మట్టి కుస్తీ ఈ రెండు సినిమాలు రేపు శుక్రవారం అంటే మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. హిట్ తో సక్సెస్ అందుకుని దానికి సీక్వెల్ గా హిట్ 2 ని నిర్మించిన నానికి గట్టి నమ్మకం ఉంది ఖచ్చితంగా హిట్ కొడతామని. హిట్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. 

Advertisement
CJ Advs

అటు అడివి శేష్ మేజర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దానితో అడివి శేష్ సినిమా అంటే స్పెషల్ ఆసక్తి క్రియేట్ అయ్యింది ప్రేక్షకుల్లో. ఇక రవితేజ-విష్ణు విశాల్ నిర్మాతలుగా మట్టి కుస్తీ పై అంచనాలు ఎలా ఉన్నా.. ప్రమోషన్స్ వీక్, అలాగే తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో డబ్ అవుతున్న ఫీలింగ్ జనాల్లో ఉంది. విష్ణు విశాల్, ఐశ్వర్య లెక్ష్మి లు సినిమాపై ఆసక్తి పెంచినా.. అది స్పోర్ట్స్ బ్యాడ్రాప్ లో తెరకెక్కడంతో.. ప్రేక్షకుల్లో సినిమాపై ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంచనా వేయలేకపోతున్నారు. ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యాక టాక్ బావుంటే.. పెట్టుబడి వచ్చేస్తుంది. టాక్ తేడా కొడితే కష్టం. 

అందుకే అటు రవితేజ, ఇటు నాని ఇద్దరూ సినిమాల్లో నటించకపోయినా సినిమాలను నిర్మించారు కాబట్టి ఇద్దరికీ టెన్షన్. హీరోగా సక్సెస్ కొట్టకపోతే ఎలా ఉంటుందో అనేది అడివి శేష్, విష్ణు విశాల్ టెన్షన్. అదన్నమాట అసలు విషయం.

The tension is increasing for these heroes:

The tension is increasing for Nani, Adivi Sesh, ravi teja, Vishnu Vishal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs