Advertisement
Google Ads BL

అల్లు శిరీష్ ఏం చేస్తున్నట్టు

allu sirish,mega compound | అల్లు శిరీష్ ఏం చేస్తున్నట్టు

మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. వరస సినిమాలు చేసినా రాని క్రేజ్ ఉర్వశివో రాక్షసివో సినిమాతో వచ్చింది. గౌరవం, కొత్త జంట ఇలా యూత్ఫుల్ స్టోరీస్ తో ఆకట్టుకోలేకపోయిన అల్లు శిరీష్ సినిమాలకి భారీ గ్యాప్ ఇచ్చి కూల్ గా ఉర్వశివో రాక్షసివో సినిమాతో హిట్ కొట్టాడు. ఆ చిత్రంలో హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ తో కలిసి లిప్ లాక్ లతో రొమాంటిక్ గా రెచ్చిపోయిన శిరీష్ అను ఇమ్మాన్యువల్ తో ఆన్ స్క్రీన్ కాదు, అఫ్ స్క్రీన్ లోను రొమాంటిక్ యాంగిల్ చూపిస్తున్నాడని ప్రచారం జరగడం దాన్ని అను ఖండించడం చూసాం.

Advertisement
CJ Advs

మరి ఉర్వశివో రాక్షసివో చిత్రం హిట్ కొట్టాక అల్లు శిరీష్ మళ్ళీ కనిపించింది లేదు. ఆయన తదుపరి ఎలాంటి చిత్రం చేస్తాడు, ఎంత గ్యాప్ తీసుకుంటాడు అనే విషయంలో క్లారిటీ లేదు. అసలు ప్రెజెంట్ అల్లు శిరీష్ ఏం చేస్తున్నాడో అనేది ఆయన ఫాన్స్ కి అర్ధం కావడం లేదు. అందులో అల్లు శిరీష్ సోషల్ మీడియా కి కూడా బ్రేక్ ఇవ్వడంతో అల్లు శిరీష్ గురించిన వార్తలు కానరావడం లేదు. 

మరి హీరో అంటే సక్సెస్ వచ్చాక పార్టీ చేసుకోవడం కాదు, నిత్యం అభిమానుల కి దగ్గరలో ఉంటేనే క్రేజ్ పెరుగుతుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

What is Allu Sirish doing?:

What is Allu Sirish going to do next?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs