Advertisement
Google Ads BL

అడ్డంగా దొరికిన సిద్దార్థ్-అతిధి రావు


హీరో సిద్దార్థ్ హీరోయిన్ అదితి రావు తో ప్రేమలో మునిగి తేలుతున్నాడని ఎంతమంది వాదిస్తున్నా.. సిద్దార్థ్ మాత్రం అదేం లేదని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. మహాసముద్రం సెట్స్ లో సిద్దార్థ్-అదితి రావు ల ప్రేమాయణం మొదలయ్యింది, తర్వాత ఇద్దరూ ముంబై లో చాలాసార్లు చక్కర్లు కొడుతూ కెమరాలకి చిక్కినా.. ఫోటో గ్రాఫర్స్ పై సిద్దు ఫైర్ అయ్యాడు. దానితో వాళ్ళ మధ్యన సం థింగ్ సం థింగ్ అనే అందరూ ఫిక్స్ అయ్యారు. తర్వాత అదితి రావు పుట్టిన రోజు కి మై స్వీట్ హార్ట్, నా యువరాణి అంటూ సిద్దు చేసిన విషెస్ తో అందరూ వీరి ప్రేమని కన్ ఫర్మ్ చేసేసుకున్నారు.

Advertisement
CJ Advs

రీసెంట్ గా బాలయ్య అన్ స్టాపబుల్ షో లో హీరో శర్వానంద్ ని బాలయ్య సిద్దు లవ్ మేటర్ అడిగారు. నాకస్సలు తెలియదు అంటూ శర్వా తప్పించుకున్నాడు. కానీ బాలయ్య, సినిమాలో అదితి రావు నీకు హీరోయిన్ అయితే.. బయట ఆయన తగులుకున్నాడా అంటూ కామెడీ చేసారు. అయితే తాజాగా సిద్దార్థ్-అతిధి లు ముంబైలో ఓ హోటల్ లో కెమెరాలు చిక్కారు. వారిద్దరూ స్పెషల్ డేట్ లో భాగంగా ముంబై లోని ఓ రెస్టారెంట్ కి వెళ్లగా అక్కడ ఫొటో గ్రాఫర్స్ వీరి ఫోటోస్, వీడియోస్ తీశారు. 

రెస్టారెంట్ నుండి బయటికి వస్తుండగా అదితి, సిద్దూలని ఫొటోస్ ని తీశారు వారు. తర్వాత అదితి అలాగే సిద్దార్థ్ ఒకే కారులో వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Siddharth and Aditi Rao at Mumbai restaurant:

Rumoured Couple Aditi Rai Hydari And Siddharth Spotted In Mumbai restaurant
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs