నందమూరి-మెగా హీరోలు కలిసి నటించేసారు.. అది పాన్ ఇండియా హిట్ కూడా అయ్యింది. తారక్-రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ట్రిపుల్ ఆర్ ని తెరకెక్కించి పాన్ ఇండియా హిట్ కొట్టారు. ఇప్పుడు సీనియర్ హీరోలైన చిరు-బాలయ్యలతో ఆలు అరవింద్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆహా అన్ స్టాపబుల్ స్టేజ్ పై ఈ కాంబో పై అరవింద్ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 ఐదో ఎపిసోడ్ కి అరవింద్-సురేష్ బాబు- కే రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి గెస్ట్ లుగా వచ్చారు.
సురేష్ బాబుని, అరవింద్ ని బాలయ్య స్టేజ్ పైకి ఆహ్వానించారు. మంచి దొంగ, భలే దొంగ గుర్తుకువస్తున్నాయి అంటూ సురేష్ బాబు ని బాలయ్య ఆటపట్టించగా.. దానికి సురేష్ బాబు కథానాయకుడు లాంటి మంచి సినిమాలు చెప్పండి బాబు అన్నారు. ఇక సురేష్ బాబు తో అనుభవం బాగానే ఉంది. మీతో మాత్రమే కాంబినేషన్ బ్యాలెన్స్ ఉంది అని అరవింద్ ని బాలయ్య అనగానే.. దానికి అల్లు అరవింద్ బాలయ్య మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఊహించని సమాధానమిచ్చారు. మీతో అలాగే చిరంజీవి గారి కాంబినేషన్ కలిపి సినిమా చేద్దామని వెయిట్ చేస్తున్నట్టుగా చెప్పడంతో.. బాలయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అంతేకాకుండా బాలయ్య ఆ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. మీరు ఇచ్చే కాంబినేషన్ పాన్ వరల్డ్ సినిమా అవుతుందని అన్నారు. దీంతో అల్లు అరవింద్, సురేష్ బాబు అందరూ సరదాగా నవ్వేసుకున్న అన్ స్టాపబుల్ ప్రోమో వదిలింది ఆహా టీం.