Advertisement
Google Ads BL

నటి పూనమ్ కౌర్ కి అనారోగ్యం


ఈమధ్యన ఎక్కువగా హీరోయిన్స్ అనారోగ్యం వార్తలని వింటున్నాం. చాలామంది హీరోయిన్స్ ఈ వ్యాధితో బాధపడుతున్నాం, అలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తమ సమస్యలని పంచుకుంటున్నారు. రీసెంట్ గా సమంత, శృతి హాసన్ ఇప్పుడు పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటుంది. ఈమధ్యన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాద యాత్రలో పాలు పంచుకుంది హైలెట్ అయ్యింది. 

Advertisement
CJ Advs

అటు సినిమాల విషయం కన్నా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన పూనమ్ కౌర్ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో కేరళలోని ఆయుర్వేద వైద్యం తీసుకుంటున్నట్టుగా ఓ న్యూస్ కాదు, ఆమె ఫొటోస్  కొన్ని లీకయ్యాయి. పూనమ్ కౌర్ గత రెండేళ్లుగా షుగర్, నీరసం, అలసట, మర్చిపోవడం, కండరాలు పట్టెయ్యడం, మానసిక స్థితిలో సమస్యలు, నిద్ర లేకపోవడం వంటి సమస్యలను ఫేస్ చేస్తుందట. అయితే పూనమ్ కౌర్ వీటి నుండి ఉపశమనం పొందడానికి కేరళ వెళ్ళినట్టుగా తెలుస్తుంది.

కెరలోని ఆయుర్వేద వైద్యులు దగ్గర పూనమ్ కౌర్ ట్రాట్మెంట్ తీసుకుంటుంది అని, ఆమె ఆయుర్వేదంతో ఈవ్యాధి నుండి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పూనమ్ కౌర్ కి ఇలాంటి ఓ అరుదైన వ్యాధి సోకినట్టుగా తెలిసి ఆమె అభిమానులు.. త్వరగా కోలుకోమంటూ ప్రార్ధనలు చేస్తున్నారు.

Poonam Kaur suffering from a rare disease:

Poonam Kaur Rare Disease, Treatment in Kerala
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs