బిగ్ బాస్ సీజన్ సిక్స్ లాస్ట్ మూడు వారాల్లో ఎనిమిదిమందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అంచనా వెయ్యడం కాస్త కష్టంగానే మారింది. ఫైమా, శ్రీసత్యలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని గెస్ చేసినా.. అనుకోకుండా శ్రీ సత్యకి ఓటింగ్ శాతం పెరిగింది. ప్రస్తుతం హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. అందులో ఆది రెడ్డి టాప్ 1 లో ఉండగా, రేవంత్ టాప్ 2 లో ఉన్నప్పటికీ.. చివరికి టికెట్ ఫినాలే టాస్క్ లో ఆది రెడ్డి గెలిచి అతను టాప్ 5 లోకి అడుగుపెట్టినట్టుగా తెలుస్తుంది. కానీ ఆది రెడ్డి నామినేషన్స్ లో ఉండి డేంజర్ జోన్ లో ఉన్నాడు.
ఈ వారం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. రెండువారాలకు గాను ముగ్గురు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇక నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి ఓటింగ్ లో టాప్ లో ఉండే రేవంత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కానీ సెకండ్ ప్లేస్ లోకి రోహిత్ అనూహ్యంగా చేరుకోవడం, రేవంత్ కి రోహిత్ కి ఓట్లలో పెద్దగా తేడా లేకపోవడం రేవంత్ అభిమానులని కలవరపెడుతుంది. ఇక టాప్ 3 లో కీర్తి భట్ ఉండగా, ఓటింగ్ లో నాలుగో స్థానంలోకి దూకేసింది శ్రీ సత్య, చివరి రెండు స్థానాల్లో ఆది రెడ్డి ఐదో స్థానంలో, ఫైమా ఆరో స్థానాల్లో ఉన్నారు.
మరి డబుల్ ఎలిమినేషన్ అయితే శ్రీ సత్య దగ్గర నుండి ఫైమా వరకు ఆది రెడ్డి తో సహా ఏ ఇద్దరు బయటికి వెళతారో అనేది ఇప్పుడు అందరి ముంది ఉన్న ప్రశ్న. ఇనాయ కెప్టెన్ అయిన కారణంగానూ, శ్రీహన్ ని ఎవరూ నామినేట్ చెయ్యని కారణంగా ఆ ఇద్దరూ సేఫ్ జోన్ లో ఉన్నారు.