బాలీవుడ్ లో ఉన్నట్టుండి ఈ వయసులో మలైకా కపూర్ ప్రెగ్నెంట్ అనే వార్తలు దావానంలా వ్యాపించాయి. అర్జున్ కపూర్ పై క్రష్ తో భర్తని వదిలేసి అతనితో సహజీవనం చేస్తున్న మలైకా తాజాగా ప్రెగ్నెంట్ అనే వార్తలు ఓ బాలీవుడ్ వెబ్ సైట్ లో రాయడం సంచలనంగా మారింది. ఈమధ్యన మలైకా అరోరా-అర్జున్ కపూర్ లు వివాహం చేసుకోబోతున్నారని న్యూస్ కూడా నడుస్తున్న సమయంలో మలైకా గర్భం దాల్చింది అనే న్యూస్ విపరీతంగా వైరల్ అయ్యింది.
ఈ న్యూస్ చూసిన అర్జున్ కపూర్ ఆ వెబ్ సైట్ పై ఫైర్ అయ్యాడు. గతంలోనూ కొన్ని కొన్నిసార్లు అర్జున్ కపూర్ కొన్ని రూమర్స్ పై ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మలైకా కపూర్ ప్రెగ్నెంట్ వార్తలపై అర్జున్ కపూర్ కాస్త ఘాటుగానే స్పందించాడు. మీరు ఎంతో ఈజీగా రాసే వార్తలు మా జీవితంపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. అలాంటివి చాలా సెన్సిటివ్ గా అనిపిస్తాయి, మరీ ఇంత నీచానికి దిగజారిపోవాలా.. ఇవే కాదు, ఇలాంటి న్యూస్ లు చాలానే రాసారు.
ఇలాంటి ఫేక్ న్యూస్ లపై మేము స్పందించడం లేదు కదా అని, ఇలాంటి న్యూస్ లని వైరల్ చేసి అసలు నిజాన్ని నొక్కేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆపకుండా మా పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూసి మా జీవితాలతో ఆడుకునే ధైర్యం చెయ్యకండి అంటూ అర్జున్ కపూర్ ఓ రేంజ్ లో ఫైర్ అవడం వైరల్ గా మారింది.