మిల్కి బ్యూటీ తమన్నా ప్రస్తుతం హీరో సత్య దేవ్ తో నటించిన గుర్తుందా శీతాకాలం తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమైంది. సీనియర్ లిస్ట్ లోకి చేరినా వరస అవకాశాలతో బిజీ గా ఉంటున్న తమన్నా ఈమధ్యన పెళ్లి చేసుకోబోతుంది అనే న్యూస్ చక్కర్ట్లు కొట్టింది. ముంబై కి చెందిన వ్యాపార వేత్తని తమన్నా కోసం పేరెంట్స్ సెలెక్ట్ చేసారని, త్వరలోనే తమ్ము పెళ్లి పీటలెక్కబోతుంది అన్నారు. కానీ తమన్నా మాత్రం నా పెళ్లి అప్పుడే కాదు అంటూ స్వీట్ గా రూమర్స్ కి చెక్ పెట్టింది. తాజాగా తమన్నా అద్భుతమైన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వయసు పెరిగే కొద్ది తమన్నా గ్లామర్ షో ఎక్కువవుతుంది. అందాలు ఆరబొయ్యడంలో తమన్నా ప్రత్యేక శ్రద్ద పెడుతుంది. రీసెంట్ గా తమన్నా డిజైనర్ వేర్ లెహంగాతో పెళ్లి కూతురు మాదిరి మెరిసిపోయే అందాలతో అచ్చం ట్రెడిషనల్ గర్ల్ లా ఇచ్చిన ఫోజులకి యూత్ కైతే నిద్ర పట్టదు. గ్రీన్ కలర్ లెహంగాలో కట్ బ్లౌజ్ లో అందాలు ఎంత గా ఎక్స్ పోజ్ చెయ్యాలో, ఎన్ని హొయలు పోవాలో అంతగా తమన్నా ఆ డ్రెస్ లో ఫొటోలకి ఫోజులు ఇచ్చింది. మిల్కి బ్యూటీ అందాలను మీరూ తనివితీరా ఆస్వాదించెయ్యండి.