Advertisement
Google Ads BL

సమంత ఆరోగ్యంపై దుష్ప్రచారాలు


టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంది. మాయోసైటిస్ వ్యాధి సమంత ని ఎంతగా ఇబ్బంది పెడుతుందో తెలియదు కానీ.. ఆమెపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్, ఆమె ఆరోగ్యంపై వచ్చే ప్రచారాలు సమంతని మానసికంగా చంపేస్తున్నాయి. మాయోసైటిస్ అనే వ్యాధి వచ్చింది, దానితో సఫర్ అవుతున్నా అని ఎప్పుడైతే ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందో అప్పటినుండి సమంత ఆరోగ్యంపై రకరకాల దుష్ప్రచారాలు ప్రచారంలోకి వచ్చాయి. 

Advertisement
CJ Advs

మొన్న రీసెంట్ గా సమంత విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరింది. ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెని హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు.. అంటూ ప్రచారంలోకి రాగా.. వెంటనే ఆమె మేనేజర్ అలాగే సమంత కుటుంబ సభ్యులు ఆమె క్షేమంగా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది అంటూ స్పందించారు. అది ముగిసిన వారం లోపే మరోసారి సమంత ఆరోగ్యం విషమం, ఆమె ట్రీట్మెంట్ కోసం సింగపూర్ కి వెళ్ళింది అని ఒకసారి, సౌత్ కొరియాకి వెళ్ళింది అని ఒకసారి ప్రచారం షురూ అయ్యింది. సమంత కండిషన్ సీరీయస్ అనే వార్తలతో ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. దానితో మరోసారి సమంత మేనేజర్ లైన్ లోకి వచ్చి సమంత కి ఏమి కాలేదు, ఆమె మాయోసైటిస్ నుండి కోలుకుంటున్నారు, ఇలాంటి వార్తలు ప్రచారం చెయ్యొద్దు అంటూ క్లారిటీ ఇచ్చాడు. 

సమంత కుటుంబ సభ్యులు కూడా ఆమె కండిషన్ సీరియస్ అనేవి రూమర్స్ మాత్రమే, ఆమె క్షేమంగా ఉంది, ఇలాంటి దుష్ప్రచారాలు ఆపండి అంటూ విన్నవించుకుంది. మరి ఇంతిలా సమంత ఫ్యామిలీ, ఆమె మేనేజర్ సమంత ఆరోగ్యం విషయంలో పదే పదే క్లారిటీ ఇవ్వడం అనేది కేవలం ఆమెపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే. ఇప్పటికైనా ఇలాంటి గాసిప్స్ స్ప్రెడ్ చెయ్యడం ఆపుతారో.. లేదో.. చూడాలి.

Samantha manager denies reports about her health:

Samantha Hospitalisation News Is A Rumour
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs