టాలీవుడ్ తో కమెడియన్, ప్రస్తుతం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ తన కూతురి పెళ్లిని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించాడు. అయితే అలీ తో పని చేసిన నటులు, టాప్ హీరోలైన నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, ఇంకా కొంతమంది హీరోలు అలీ కూతురు ఫాతిమా పెళ్ళికి వెళ్లి కొత్త జంటని ఆశీర్వదించి వచ్చారు. రీసెంట్ గా జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కి ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. అయితే పెళ్ళిలో కానీ, రిసెప్షన్ లో కానీ అలీ స్నేహితుడు, పొలిటికల్ నేత, టాప్ హీరో పవన్ కళ్యాణ్ కనిపించకపోవడంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
అలీ సినిమాల్లో స్నేహితుడే.. కానీ రాజకీయాల్లోకి వెళ్ళాక పవన్ పై విమర్శనాస్త్రాలు సందిస్తున్నాడు. అలాగే పవన్ కూడా అలీ పై రాజకీయంగా ఎటాక్ చేస్తున్నారు. మరి నిజంగా పవన్ కళ్యాణ్ ని అలీ పెళ్ళికి పిలిచాడో లేదో తెలియదు, ఒకవేళ పిలిచినా పవన్ కళ్యాణ్ కావాలనే రాలేదో తెలియదు.. కానీ ఓ నెటిజెన్ మాత్రం పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతూ ఓ పోస్ట్ పెట్టాడు. అదేమిటంటే రాజకీయాలు పక్కన పెట్టి తోటి స్నేహితుడి కూతురి పెళ్ళికి వెళ్లడం తెలియదా @PawanKalyan? Cinema Industry intha Ghoram enti raa ? అంటూ పవన్ కళ్యాణ్ ని టాగ్ చేస్తూ ఆ నెటిజెన్ ఇలా పోస్ట్ పెట్టాడు.
నిజంగానే పవన్ కళ్యాణ్-అలీ మంచి ఫ్రెండ్స్. పవన్ సినిమాల్లో అలీ కీ రోల్స్ పోషిస్తాడు. అంత మంచి ఫ్రెండ్స్ రాజకీయాల పరంగా కొట్టుకుని దూరమవడం చాలామందికి నచ్చడం లేదు. అందులో భాగమే ఈ నెటిజెన్ ట్వీట్.