Advertisement
Google Ads BL

మీనా రెండో పెళ్లిపై క్లారిటీ


ఈ ఏడాది సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యా సాగర్ ని కోల్పోయింది. పోస్ట్ కోవిడ్ సమస్యలతో అనారోగ్యం పాలై కొన్నాళ్ళు హాస్పిటల్ లోనే ఉన్న విద్యా సాగర్ మృతి చెందారు. దానితో మీనా ఆమె కూతురు ఇద్దరూ విద్యా సాగర్ మృతితో దుఃఖ సాగరంలో మునిగిపోయారు. భర్త చనిపోయిన కొద్ది నెలలకే మీనా మళ్ళీ యాధస్థితికి చేరుకొని ఆమె నటిస్తున్న సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది. తెలుగులో, తమిళంలో బిజీ గా వున్న మీనాని మధ్యలో ఆమె ఫ్రెండ్స్ ఛిల్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే గత కొద్ది రోజులుగా నటి మీనా రెండో వివాహం చేసుకోబోతుంది అని, ఆమెకి ఇంకా 46 ఏళ్ళే, పాప చిన్న పాపే కాబట్టి రెండో పెళ్లి చేసుకోమని మీనా తల్లితండ్రులు ఆమెని ఫోర్స్ చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. ఒంటరి జీవితం గడపడం ఇబ్బంది అవుతుంది అంటూ మీనాకి నచ్చ జెప్పే ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు. తాజాగా మీనా రెండో వివాహంపై ఆమె స్నేహితురాలు ఒకరు పూర్తి క్లారిటీ ఇచ్చారు. మీనా రెండో పెళ్లి చేసుకోవడం లేదు, చేసుకునే ఉద్దేశ్యం లేదు.

ఒకవేళ మీనా రెండో పెళ్లి చేసుకుందామనుకుంటే స్వయంగా ఆమె ప్రకటన చేస్తుంది, ఆమె పేరెంట్స్ కూడా ఆమెని ఇబ్బంది పెట్టడం లేదు, ఇలాంటి పుకార్లు సృష్టించవద్దు, స్ప్రెడ్ చెయ్యవద్దు అంటూ మీనా ఫ్రెండ్ ఆమె రెండో పెళ్లిపై పర్ఫెక్ట్ క్లారిటీ ఇచ్చింది.

Clarity on Meena second marriage:

Meena Friend Gives Clarity on Her Second Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs