విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ మూవీలో కరణ్ జోహార్ సజెషన్ తో హీరోయిన్ గా బాలీవుడ్ మైటీ అనన్య పాండే సౌత్ కి పాన్ ఇండియా మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. అనన్య ని ఎంపిక చెయ్యగానే అందరి చూపు ఆమె పైన పడింది. విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ స్టార్ పక్కన హీరోయిన్ గా అనన్య పాండే లక్కీ ఛాన్స్ కొట్టింది అన్నారు. కానీ లైగర్ మూవీ చూసాక అనన్య పాండే గ్లామర్ మీద సౌత్ ఆడియన్స్ కి వెగటు పుట్టింది. చీపురు పుల్లకి చీరకట్టినట్టుగా, వెదురు కర్రకి మోడ్రెన్ డ్రెస్ వేసినట్టుగా ఉంది అనే కామెంట్స్ చేసారు.
అయితే ముంబై లో జిమ్ వేర్ డ్రెస్సులతో, పార్టీ వేర్ డ్రెస్సు లతో మెస్మరైజ్ చేసిన అనన్య పాండే అందాలు దక్షిణాది ప్రేక్షకులకి అస్సలు రుచించలేదు. ఇక లైగర్ సినిమా డిసాస్టర్ తర్వాత అనన్య పాండే బాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యింది. తాజాగా ఆమె ఓ రాంప్ వాక్ కోసం లీఫ్ బ్లూ డ్రెస్ లో గ్లామర్ గా రెడీ అయ్యి ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనన్య పాండే సోయగాలు చూపిస్తూ.. కాస్ట్లీ కారు పక్కన హొయలు పోతున్న ఫొటోస్ షూట్ అది. ఆమె రాంప్ వాక్ కోసం మేకోవర్ అవుతున్న పిక్స్. మరి మీరు అనన్య కొత్త పిక్ ని ఓ లుక్కెయ్యండి.