Advertisement
Google Ads BL

అత్తారింట్లో అల్లు అర్జున్


అల్లు అర్జున్ ఇప్పుడు క్రేజీ పాన్ ఇండియా స్టార్. ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఎంతగా ఆరాటపడుతున్నారో.. ఆయన్ని కలిసి ఓ సెల్ఫీ దిగాలనే ఆత్రుత ఆయన అభిమానులు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం రష్యా దేశం లో విడుదలవుతుంది, మరోపక్క పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఈ మధ్యనే మొదలవగా ఇంకా అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ లోకి ఎంటర్ వ్వలేదు. తాజాగా అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి పుట్టింటికి వెళ్లారు. అంటే అల్లు అర్జున్ అత్తారిల్లన్నమాట. ఆయన నల్లగొండ జిల్లా, పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ రెడ్డి కూతురు స్నేహ రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
CJ Advs

అయితే అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి చంద్రశేఖర్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. కారణం స్నేహ చిన్నాన్న, చంద్రశేఖర్‌ రెడ్డి తోడల్లుడు మూడు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో అత్త, మామగార్లని పలకరించి, చిన్న మామగారి ఫోటో కి నివాళులర్పించడానికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి చింతపల్లి వెళ్ళాడు. తర్వాత అత్తగారింట్లో కాసేపు విశ్రాంతి తీసుకునే క్రమంలో అల్లు అర్జున్ తో ఫొటోస్ దిగేందుకు స్నేహ చుట్టాలు పోటీ పడ్డారు.

అయితే చింతపల్లికి అల్లు అర్జున్ వచ్చాడని తెలియగానే చుట్టూ పక్కల గ్రామాల అల్లు అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఉన్న చింతపల్లికి రావడంతో అక్కడ కాస్త గందరగోళం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అయితే అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చి అల్లు అర్జున్ తో ఫొటోస్ దిగడానికి ఎగబడగా.. బౌన్సర్లు వాళ్ళని అడ్డుకోవడంతో అల్లు అభిమానులు కాస్త డిస్పాయింట్ అయ్యారు.

Allu Arjun Came To Mother In Law House:

Allu Arjun and his wife Sneha Reddy went to Chintapalli village
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs