నరేష్-పవిత్ర లోకేష్ లపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ పోలీస్ లకి ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగే వెబ్ సైట్స్ లో తమపై తప్పుడు వార్తలు రాస్తున్నారని, మార్ఫింగ్ చేసిన ఫొటోస్ తో ఇబ్బంది పెడుతున్నారంటూ పవిత్ర లోకేష్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీస్ లు ఈ కేసుపై విచారణ చేపట్టారు. అయితే నరేష్ మూడో భార్య రమ్య కావాలనే ఇవన్నీ సృష్టించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ వెనుక ఉండి కథ నడిపిస్తున్నటుగా ఆమె ఆరోపిస్తుంది.
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని అడ్డుపెట్టుకుని తనని కించపరుస్తుంది, ఆమె కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేయిస్తుంది, రమ్య నరేష్ ల మధ్యన గొడవలు ఉన్నాయి, ఆమెపై పలు క్రిమినల్ కేసులున్నాయి, నన్ను దూషిస్తుంది, నా పరువుకు భంగం కలిగేలా రమ్య ప్రవర్తిస్తుంది. నా పర్సనల్ లైఫ్ ని విమర్శిస్తుంది, గతంలో నాపై దాడి చేసేందుకు కూడా వెనుకాడలేదు.. అంటూ పవిత్రా లోకేష్ పోలీస్ లకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
పవిత్రా లోకేష్ తన ఫిర్యాదులో ముగ్గురి పేర్లను పేర్కొన్నారని, ఇందుకోసం సదరు వ్యక్తులను విచారణ నిమిత్తం హాజరుకావాలని ఆదేశించినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. కానీ రమ్యను మా విచారణకు పిలవలేదని, అవసరమైతే ఆమెను కూడా విచారిస్తామని ఆయన తెలిపారు. అలాగే పవిత్రా లోకేష్ కంప్లైంట్ చేసిన 15 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ నోటీసులు పంపించామన్నారు.