Advertisement
Google Ads BL

బ్రహ్మానందం ఇంట్లో సంబరాలు


కమెడియన్ బ్రహ్మానందం ఇంట్లో సంబరాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే బ్రహ్మీ కుమారుడు గౌతమ్ మరోసారి తండ్రయ్యాడు. ఈసారి బ్రహ్మానందానికి మనవరాలు పుట్టింది. ఇంతకుముందు బ్రహ్మికి మనవడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చినట్లుగా తెలియజేసారు. బ్రహ్మి కుమారుడు గౌతమ్ కి జ్యోత్స్న రెడ్డితో 2012 అక్టోబర్‌లో వివాహం జరిగింది. తర్వాత వాళ్ళకి ఓ బాబు పార్ధ జన్మించాడు. తాజాగా గౌతమ్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Advertisement
CJ Advs

తనకు పాప పుట్టిన విషయాన్ని గౌతమ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించగా.. ఆయన ఫ్రెండ్స్, బ్రహ్మానందం అభిమానులు ఆయనకి, ఆయన ఫ్యామిలీకి అభినందనలు తెలుపుతున్నారు. ఇక బ్రహ్మానందం నటించిన పంచతంత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆయన ఈమధ్యన చాలా రేర్ గా సినిమాల్లో కనిపిస్తున్నారు. గతంలో బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు, కానీ ఈమధ్యన ఆయన హవా బాగా తగ్గినట్లుగా కనబడుతుంది.

Brahmanandam once again becomes a grandfather:

Happy moment for Brahmanandam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs