Advertisement
Google Ads BL

హీరోల రెమ్యూనరేషన్‌పై దిల్ రాజు కామెంట్స్


సినిమా రంగం ఎప్పుడూ మాయే అని అన్నారు.. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు. ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. అనేకానేక విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా హీరోల రెమ్యూనరేషన్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్‌ని మించి టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ పెరిగిపోతుంది.. దీనికి ‘బాహుబలి’ చిత్రమే కారణమా? అనే ప్రశ్నకు దిల్ రాజు సమాధానమిస్తూ..

Advertisement
CJ Advs

 

‘‘ఏ ఇండస్ట్రీ అయినా.. రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్లది తప్పు కాదు. ఇచ్చే నిర్మాతలదే తప్పు. ఇది డిమాండ్ అండ్ సప్లయిని బట్టి ఉంటుంది. ఈ సినిమాకు వారు అవసరం అనుకున్నప్పుడు.. తప్పదు. ఇరవై ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నాను కాబట్టే నేను కాలిక్యులేటెడ్‌గా పని చేస్తాను. హీరో వంద అడిగితే, మిగతా టెక్నీషియన్లకు ఎంతవుతుంది? మేకింగ్‌కి ఎంత సమయం పడుతుంది. ఒకవేళ సినిమా ఆరు నెలల్లో పూర్తయితే ఇంట్రస్ట్‌లు మిగులుతాయి. ఏడాది అయితే పెరుగుతాయి. లాభాలతో పని లేకుండా డ్యామేజీ జరగకుండా కాలిక్యులేటెడ్‌గా ఉండడం ప్రొడ్యూసర్‌ పని. అలాగే డిస్ట్రిబ్యూటర్‌ను కాపాడుకోవలసిన బాధ్యత కూడా ప్రొడ్యూసర్‌దే! అలా కాకుండా అబ్‌నార్మల్‌ ప్రైజులకు అమ్మేస్తే, సినిమా ఫ్లాప్‌ అయినప్పుడు వారంతా నిర్మాతల మీద పడిపోతారు..’’ అని దిల్ రాజు తెలిపారు.

Dil Raju Comments on Heroes Remuneration:

Dil Raju about Movie Making
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs