బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి క్రేజీ జబర్దస్త్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫైమా మొదట్లో తనదైన శైలిలో కామెడీ చేస్తూ ఆకట్టుకుంది. ఆమెకి అందం లేకపోయినా, ఆకర్షణ లేకపోయినా జబర్దస్త్ స్టేజ్ పై బెస్ట్ పెరఫార్మెర్ గా ప్రూవ్ చేసుకుని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. ఇక్కడ హౌస్ లో 21 మందిలో ఒకరిగా సత్తా చాటింది. తర్వాత కామెడీ స్థానంలోకి వెటకారం ప్రవేశించాక ఫైమా మీద నెగిటివిటి మొదలయ్యింది. టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఫైమా ప్రవర్తన షాకిచ్చింది. రేవంత్ తో కానివ్వండి, ఇనయతో కానివ్వండి గొడవ పెట్టుకుని వెటకారం చేస్తూ వస్తున్న ఫైమా టాస్క్ పరంగా ఇరగదీస్తోంది. కానీ ఆమెకి ఓవర్ కాన్ఫిడెంట్ ఎంత ఎక్కవైందో గత రాత్రి ఎలిమినేషన్ ఎపిసోడ్ లో బయటపడింది.
గత వారం ఫైమా రేవంత్-శ్రీహన్ తో పోటీ పడి హౌస్ మేట్స్ సహకారంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకుంది. అంటే ఆమె డేంజర్ జోన్ లోకి వస్తే ఆ పాస్ వాడి ఆమె సేవ్ అవ్వొచ్చు. అనుకున్నట్టుగానే రాజ్-ఫైమా డేంజర్ జోన్ లో ఎలిమినేషన్ కత్తి కింద నిలబడ్డారు. ఆ టైమ్ లో రాజ్ నీ కోసం ఈ పాస్ వాడతాను అంది. కాదు నీ కోసం వాడుకో అన్నాడు రాజ్. ఫైమా నాకు ఓట్స్ వేసి ఆడియన్స్ ఇక్కడ ఉంచారు. వాళ్ళ ప్రేమతో ఇక్కడ ఉన్నా, ఇకపై ఉంటా అనే నమ్మకం ఉంది. నాకు ఈ పాస్ అవసరం లేదు అన్నట్టుగా ఓవర్ గానే మాట్లాడింది. హౌస్ మేట్స్ , నాగార్జునా కూడా ఈ పాస్ నువ్వే వాడుకో అన్నా వినలేదు.
చివరికి నాగార్జున అటు తిప్పి ఇటు తిప్పి ఫైమాని ఒప్పించారు. దానితో లీస్ట్ లో నువ్ ఉంటే నీ పాస్ వలన నువ్ సేవ్ అవుతావు, లేదంటే రాజ్ ఎలిమినేట్ అవుతాడని నాగ్ చెప్పాడు. అయినప్పటికీ ఫైమా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది. కానీ ఆడియన్స్ ఫైమ ఓవర్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బకొట్టారు. ఓట్స్ తక్కువ వేసి ఆమెని లీస్ట్ లో ఉంచడంతో ఆమె ఎలిమినేట్ అవ్వాల్సింది.. ఎవిక్షన్ ప్రీ పాస్ వలన బ్రతికి పోగా.. పాపం రాజ్ ఎలిమినేట్ అయ్యాడు.