నందమూరి బాలకృష్ణ అఖండ తో అద్భుతమైన విజయం సాధించి ఊపు మీదున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో వీర సింహ రెడ్డి చేస్తున్నారు. వీర సింహ రెడ్డి గా బాలయ్య మాస్ పవర్ ఫుల్ లుక్ మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేసింది. ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ కి ఫాన్స్ ఊగిపోయారు. అటు టీజర్ ఇటు పవర్ ఫుల్ లుక్ అలాగే అఖండ విజయంతో ఉన్న బాలయ్య-క్రాక్ తో హిట్ కొట్టిన గోపీచంద్ కలయికలో వస్తున్న వీర సింహ రెడ్డిపై అంచనాలు మాములుగా లేవు.
ప్రస్తుతం అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చిత్రకరణ జరుగుతుంది. రాయలసీమ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. నాన్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే సోల్డ్ అవుట్ కాగా.. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కోసం చాలా సంస్థలు పోటీపడుతున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో బాలయ్య వీరసింహ రెడ్డి ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని తెలుస్తుంది.
అమెజాన్ ప్రైమ్ కళ్లు చెదిరే మొత్తాన్ని అందజేసి డిజిటల్ రైట్స్ చేజిక్కించుకుంది అని, బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అంటున్నారు. థమన్ మ్యూజిక్ పై అంచనాలు ఉండడం, హీరోయిన్ గా శృతి హాసన్ నటించడం అన్ని సినిమాకి బిగ్ ప్లస్ లుగా కనిపించడంతో సదరు సంస్థ పోటీపడి అంత రేటు పెట్టినట్లుగా చెబుతున్నారు.