Advertisement
Google Ads BL

రామ్ లాంటి హీరో ఎవరు తగులుతారో?


పూరి జగన్నాద్ ఇండస్ట్రీకి ఎన్ని హిట్స్ ఇచ్చాడో.. అంతకన్నా ఎక్కువే ప్లాప్స్ ఇచ్చాడు. మహేష్ కి పోకిరి-బిజినెస్ మ్యాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరి నుండి చాలా చెత్త సినిమాలు కూడా వచ్చాయి. ఎలాగో ఎన్టీఆర్ టెంపర్ తో హిట్ కొట్టిన పూరి మరోసారి డిజాస్టర్స్ చవిచూశాడు. తర్వాత యంగ్ హీరో రామ్ కి మాస్ గా ఇస్మార్ట్ శంకర్ కథ చెప్పి ఒప్పించి సినిమా చేసాడు. అది బంపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అదే ఊపులో విజయ్ దేవరకొండ తో లైగర్ మొదలు పెట్టి ఊపు చూపించాడు. కానీ లైగర్ పూరీని ఆర్ధికంగా నష్టాల్లో పడేసింది. అటు డైరెక్టర్ గా, ఇటు నిర్మాతగా పూరికి కోలుకోలేని దెబ్బ వేసింది.

Advertisement
CJ Advs

జన గణ మన అని మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ మధ్యలో లైగర్ అప్పులతో సతమవుతుంటే.. డిస్ట్రిబ్యూటర్స్ నుండి తలనొప్పులు, అదే సమయంలో ఈడీ విచారణ అంటూ పూరి నలిగిపోయాడు. మరి పూరి చెయ్యబోయే తదుపరి మూవీ ఏమిటో? ఆయనకి ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరైనా తగులుతారా.. లేదా.. అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. మళ్లీ రామ్ లాంటి హీరో ధైర్యం చేసి ఒక్క ఛాన్స్ ఇస్తే పూరి అతనికి ఇస్తే హిట్ ఇస్తాడు, లేదంటే డిసాస్టర్. ఏదో ఒకటి నమ్మి పూరి కథకి కనెక్ట్ అయ్యే ఆ హీరో ఎవరో చూడాలి.

Puri next hero?:

Who'll Be Puri Jagannadh Next Hero?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs