థియేటర్స్ లో మ్యూజిక్ లవర్స్ నే కాదు సినిమా ప్రేమికులని ఓ రేంజ్ లో ఉర్రుతలూగించి గూస్ బంప్స్ తెప్పించిన కాంతారాలోని వరాహ రూపం సాంగ్ కాంట్రవర్సీకి గురైంది. ఆ సాంగ్ కేరళలోని ఓ మ్యూజిక్ ఆల్బమ్ నిర్వాహకులు సాంగ్ కి కాపీ అంటూ కోర్టులో కేసు వెయ్యడంతో కాంతార మేకర్స్ ఆ సాంగ్ లోని బాగ్ రౌండ్ మ్యూజిక్ ని తొలగించిన తర్వాతే కాంతార ని ఓటిటిలో రిలీజ్ చేసారు.
వరాహ రూపం సాంగ్, BGM వినిపించకపోవడంతో కాంతారని ఓటిటిలో చూసిన ప్రేక్షకులు నిరాశపడిపోయారు. అయితే ఆ సినిమా ఓటిటిలోకి వచ్చిన మూడో రోజే వరాహ రూపం సాంగ్ కాపీ పై వచ్చిన కేసుని కోర్టు కొట్టివేయడంతో కాంతార మేకర్స్ హడావిడిగా వరాహ రూపం సాంగ్ ని ఓటిటి కాంతారలో యాడ్ చేసారు. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది.. అదేమిటంటే కేవలం తమిళ్, హిందీ భాషల్లోనే వరాహ రూపం సాంగ్ యాడ్ చేసారు.
తెలుగు, కన్నడ భాషల్లో ఇంకా ఈ పాటని యాడ్ చెయ్యలేదు టీం. ఆ పని కూడా త్వరలోనే పూర్తవుతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం హిందీ, తమిళ ప్రేక్షకులు కాంతారకు బ్యాక్ బోన్ గా నిలిచి ఆడియన్స్ ని అలరించిన వరహా రూపం సాంగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.