Advertisement
Google Ads BL

సౌత్ పై జాన్వీ కపూర్ స్పెషల్ ఫోకస్


నిన్నమొన్నటివరకు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుదామనుకుని చతికిల పడిన జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ సారా అలీ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది సమయానికే స్టార్ హీరోయిన్ గా మారింది. వరసగా సక్సెస్ లు కొట్టింది. కానీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్లు పైనే అవుతున్నా ఆమెకి ఇంకా సక్సెస్ రాలేదు. రీసెంట్ గా మిలి తోనూ జాన్వీ డిసాస్టర్ అందుకుంది. 

Advertisement
CJ Advs

అయితే ముందు బాలీవుడ్ హీరోయిన్ గా నిలదొక్కుకున్నాకే సౌత్ కి ఎంట్రీ ఇస్తే ఇక్కడ రెడ్ కార్పెట్ పరుస్తారు అనుకున్న జాన్వీ కపూర్ కి ఇప్పుడు సౌత్ నుండి అవకాశాలు వెళ్లడం లేదనే టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు జాన్వీ కపూర్ ని సౌత్ లో పరిచయం చెయ్యాలని చూసారు. అలాగే ఇంకా కొంతమంది హీరోల సినిమాల్లో ఆమెని సంప్రదిస్తున్నారనే న్యూస్ లు చక్కర్లు కొట్టాయి. అటు జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ తో నటించాలని ఉంది. విజయ్ దేవరకొండ అంటే క్రష్ అంటూ చెప్పుకుంటుంది.

తాజాగా తనకి సౌత్ లో నటించాలనే కోరికని బయటపెట్టింది. టాలీవుడ్ లో నటించాలనేది నా కోరిక.. తొందరగా ఆ కోరిక నెరవేరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. నేను చిన్నప్పుడు తన తల్లితో హైదరాబాద్‌లో ఎక్కువ సమయం గడిపాను. నాన్న ఇక్కడ షూటింగ్ చేసేటప్పుడు నేను వచ్చేదాన్ని అంటూ సౌత్ పై ప్రేమని ఒలకబోస్తుంది. ఇదంతా ఇక్కడ ఆఫర్స్ కోసమేనని, అందుకే తెలుగు గురించి స్పెషల్ గా మాట్లాడుతుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Janhvi Kapoor special focus on South:

Janhvi Kapoor special interest on South
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs