Advertisement
Google Ads BL

ఆసక్తి తగ్గిస్తున్న అన్ స్టాపబుల్


బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటిటిలో మొదలైన అన్ స్టాపబుల్ టాక్ షో ఫస్ట్ సీజన్ విపరీతమైన సక్సెస్ అవడమే కాదు, టాక్ షో లకే ఆహా అన్ స్టాపబుల్ షాకిచ్చి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. బాలయ్య బాబు కామెడీ, ఆయన చిలిపి, అల్లరి చేష్టలు, సెలబ్రిటీస్ ని అడిగే ప్రశ్నలు, వారితో ఆడించే ఆటలు, సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలతో అన్ స్టాపబుల్ ని ఇంట్రెస్టింగ్ టాక్ షో గా మార్చేశారు. టాప్ హీరోలంతా బాలయ్య టాక్ షోకి వచ్చి వెళ్లారు. వారం వారం ఏ హీరో వస్తారో, బాలయ్య ఆట ఎలా ఉంటుందో అంటూ ఆడియన్స్ ని వెయిట్ చేయించగలిగారు. అంతే కాకుండా ప్రతి ఎపిసోడ్ ప్రోమో ని, అలాగే ఆ ఎపిసోడ్ కి రివ్యూస్ ఇస్తూ వెబ్ సైట్స్, ఛానల్స్ హడావిడి చేసేవి.

Advertisement
CJ Advs

సీజన్ 1 తో అన్ స్టాపబుల్ సీజన్ 2 పై మరిన్ని అంచనాలు పెంచేశారు. కానీ అన్ స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ అంతగా క్లిక్ అవడం లేదు. ఎపిసోడ్స్ గ్యాప్ గ్యాప్ లు ఇస్తూ వస్తున్నాయ్ వెళుతున్నాయ్.. కానీ ఆ ఎపిసోడ్స్ కి అంతగా మంచి రివ్యూస్ రావడం లేదు, క్రేజీ గా కనిపించిన సందర్భము కనిపించడము లేదు. కారణం ఆహా టాక్ షో లో ఎక్కువగా పొలిటికల్ టచ్ ఇవ్వడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మధ్యలో రెండు ఎపిసోడ్స్ కుర్ర హీరోలతో ఆసక్తి గా మార్చిన ఆహా వారు పొలిటికల్ ఎపిసోడ్స్ ని మరీ చప్పగా డిజైన్ చేస్తున్నారు.

ఒక్క చంద్రబాబు ఎపిసోడ్ తప్ప బాలకృష్ణ గారు కూడా పొలిటికల్ ఎపిసోడ్స్ లో అంతగా ఓపెన్ అవ్వడం లేదనే కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి.

Unstoppable 2 reducing interest:

Balakrishna Unstoppable 2 update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs