సీనియర్ హీరోలు చిరంజీవి-బాలకృష్ణలు సంక్రాంతికి తలపడబోతున్నారు. వీర సింహ రెడ్డి గా బాలకృష్ణ, వాల్తేర్ వీరయ్యగా చిరంజీవి ఇద్దరూ పవర్ ఫుల్ లుక్స్ తో పవర్ ఫుల్ గా రాబోతున్నారు. ఈ రెండు సినిమాలపై బోలెడన్ని అంచనాలున్నాయి. వీర సింహ రెడ్డిగా బాలకృష్ణ లుక్, ఆయన డైలాగ్ డెలివరీ టీజర్ లోనే చూపించి అరిపించారు. వాల్తేర్ వీరయ్యగా మెగాస్టార్ మాస్ లుక్ మెగా ఫాన్స్ కి పూనకాలు తెప్పించింది. దీనితో రెండు సినిమాల మధ్యన సంక్రాంతికి రసవత్తర పోటీ గ్యారెంటీ అనుకుంటున్నారు.
అయితే వీర సింహారెడ్డి-వాల్తేర్ వీరయ్యల మధ్యన ఫైట్ జరుగుతుండడంతో.. వాటిమధ్యన జరిగే ప్రమోషన్స్ పై అంతే అంచనాలుంటున్నాయి. తాజాగా వాల్తేర్ వీరయ్యనుండి బాస్ పార్టీ సాంగ్ వదిలితే.. వీర సింహ రెడ్డి నుండి జై బాలయ్య సాంగ్ వదిలారు. వాల్తేర్ వీరయ్య సాంగ్ ఫాన్స్ ని నిరాశపరిస్తే.. జై బాలయ్య గా వీరసింహ రెడ్డి సాంగ్ కూడా అభిమానులకి నచ్చలేదు. అటు థమన్ ఇటు దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరూ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఫెయిల్ అయ్యారు.
ఈ సీనియర్ హీరోల రెండు సాంగ్స్ ని ట్రోల్ చేస్తున్నారు సినీ జనాలు. చిరు-బాలయ్య ఇద్దరి సాంగ్స్ నచ్చలేదని.. థమన్ మ్యూజిక్ లో పాత వాసన కనిపిస్తే.. దేవిశ్రీ మ్యూజిక్ అవుట్ డేటెడ్ అంటూ, ఒకళ్ళు కాదు ఇద్దరూ నిరాశ పరిచారంటూ కామెంట్స్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్.