‘జబర్ధస్త్’ అంతగా ఫేమస్ కావడానికి.. కమెడియన్స్ చేసే స్కిట్స్, జడ్జ్‌లు ఇచ్చే తీర్పే కారణం అని అంతా అనుకుంటారు. కానీ ఇన్నేళ్లుగా (ఇప్పుడు కాదండోయ్) ‘జబర్ధస్త్’ పేరు మారు మోగడానికి కారణం అనసూయ అని, ఆమె ఎంట్రీ సాంగ్, ఆమె యాంకరింగ్ అని చాలా మందికి తెలియదు. గ్లామర్ ఒలకబోస్తూ.. ఎంట్రీలో ఆమె వేసే డ్యాన్స్, మధ్యమధ్యలో తను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, అప్పుడప్పుడు ఆమె స్కిట్స్‌లో కనబరిచే నటన.. ఇలా ఒక్కటేమిటి.. దాదాపు 50 శాతం ఆమె ఈ షో సక్సెస్‌కి కంట్రిబ్యూషన్ అందించిందని చెప్పుకోవచ్చు. ఆమెలేని ‘జబర్ధస్త్’ ఇప్పుడెలా ఉందో.. ఆ షోని అభిమానించే వారిని కదిలించి చూడండి.. క్లారిటీ ఇచ్చేస్తారు. సరే విషయంలోకి వస్తే.. జబర్ధస్త్‌లో లేకపోతేనేం, సోషల్ మీడియాలో ఉందిగా.. అనేలా నెటిజన్లను ఆమె ఆకర్షిస్తోంది.
తన మూడ్‌ని బట్టి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యే అనసూయ.. తాజాగా ఓ కవితను పోస్ట్ చేసి.. ఖతర్నాక్ లాంటి ఓ స్టిల్‌ని పోస్ట్ చేసింది. ఈ పిక్‌లో ఆమె ఇచ్చిన రొమాంటిక్ లుక్.. కుర్రకారుకి సైతం కలలోకి వచ్చేలా ఉందంటే.. ఏ రేంజ్‌లో అను ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆమె పోస్ట్ చేసిన కవితని చూస్తే మాత్రం.. అను నీతో ఎలా వేగడం అని కామెంట్స్ చేయని నరుడు ఉండడంటే.. ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఆ కవిత ఏంటో ఓ లుక్కేసుకోండి..
‘‘మది దాచుకున్న రహస్యాన్ని
వెతికేటి నీ చూపునాపేదెలా
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న
నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న
నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం’’