బిగ్ బాస్ సీజన్ సిక్స్ చివరి అంకానికి చేరుకుంది. ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలింది. హౌస్ లో తొమ్మిదిమంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఈ వారం ఏడుగురు నామినేషన్స్ లోకి వచ్చారు. అలాగే ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో ఒక్కొక్కరి కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఇనాయ ఓటింగ్ పరంగా టాప్ ప్లేస్ ని చేజిక్కించుకుంది. ఆమె ఆడ పులిలా గర్జించడమే కాదు, గేమ్ పరంగాను అబ్బాయిలకి పోటీగా మారింది. అలాగే శ్రీహన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
మూడో స్థానంలో ఆది రెడ్డి ఉండగా, నాలుగో స్థానంలో రోహిత్ ఉన్నాడు. ఐదో ప్లేస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ ఎఫెక్ట్ తో కాస్త కోలుకుని సేవ్ అయ్యింది శ్రీ సత్య. లేదంటే శ్రీ సత్య ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకునే అవకాశమే లేదు. ఇక తర్వాత చివరి స్థానాలు, డేంజర్ ప్లేస్ లో రాజ్-ఫైమాలు కొనసాగుతున్నారు. ఈ వారం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండడంతో ఆమె సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక రాజ్ ఫైనల్ గా ఎలిమినేట్ అయ్యేలా కనబడుతుంది ప్రస్తుత పరిస్థితి.
రేవంత్ కెప్టెన్ అయిన కారణంగా అలాగే కీర్తిని ఎవరూ నామినేట్ చెయ్యని కారణంగా వారు సేఫ్ జోన్ లోకి వెళ్లారు. చూద్దాం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఈ శనివారం 3 గంటలకల్లా తేలిపోతుంది. ఆదివారం ఎలిమినేట్ అవ్వల్సిన హౌస్ మేట్ ఎవరనేది శనివారమే లీకుల వీరు లీక్ చేసి పడేస్తున్నారు కదా..