నటసింహ నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వీరసింహారెడ్డిలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో కనిపించనున్నారు. థియేటర్లలో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేంత అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. బాలయ్య మాస్ లుక్, ఆయన వైట్ అండ్ వైట్ లుక్ అన్ని పవర్ ఫుల్ గా కనిపించాయి. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ జై బాలయ్యతో మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించారు.
బాలకృష్ణ అభిమానులకు నినాదమైన జై బాలయ్య ను ఫ్యాన్స్ కోసం మాస్ సాంగ్ గా కంపోజ్ చేసాడు సంగీత దర్శకుడు థమన్. థమన్ బాలకృష్ణ స్వాగ్, మాస్ స్టెప్స్ తగినట్లు ఈ పాటని స్కోర్ చేశారు. బాలకృష్ణ డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ .. ఈ పాత అలాగే బ్యాగ్డ్రాప్ చూస్తే పాత చింతకాయ పచ్చడిలా ఉంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. బాలకృష్ణ లుక్ తప్ప ఆ సాంగ్ లో మరేదీ ఆకట్టుకోలేదని, భారీ తనం కొట్టొచ్చినట్టుగా ఉంది.. కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది అంటూ మాట్లాడుకుంటున్నారు.
మధ్యలో థమన్ మేళం ఏమిటో.. తన ట్రూప్ తో ఇంత ఎలివేట్ అవ్వాల్సిన అవసరమే లేదు అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. మరోపక్క థమన్ మ్యూజిక్ పై కాపీ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. బాలయ్య పాట మాస్ ప్రేక్షకులకు, అభిమానులకి బాగానే నచ్చినప్పటికీ ఓ వర్గం వారు మాత్రం ఎక్కువగా సోషల్ మీడియా లో ట్రోలింగ్ మొదలుపెట్టేసారు. సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాలకే.. ఒసేయ్ రాములమ్మ ట్యూన్ కు చాలా దగ్గరగా ఉంది అంటూ.. దాదాపు అదే తరహాలో ట్యూన్ దించేశాడు అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.