Advertisement
Google Ads BL

ఇండియ‌న్ ఆర్మీ కి సారి చెప్పిన హీరోయిన్


బాలీవుడ్ నటి రిచా చ‌ద్దాకి నెటిజెన్స్ చుక్కలు చూపించారు. రిచా చ‌ద్దా చేసిన ట్వీట్ ఇండియ‌న్ ఆర్మీని అవ‌మానించేలా ఉందంటూ ఆమె పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు రావడంతో దెబ్బకి దిగొచ్చిన రిచా చ‌ద్దా ఇండియన్ ఆర్మీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయంలోకి వెళితే ఇండియన్ ఆర్మీ నార్తర్న్ కమాండ్ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఓ ట్వీట్ చేసారు. ప్రభుత్వం గనక ఆదేశిస్తే.. పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌ను తిరిగి చేజిక్కించుకునేందుకు ఇండియ‌న్ ఆర్మీ సిద్ధంగా ఉంది. ఈ పనిని చాలా త్వ‌ర‌గా పూర్తి చేస్తాం. అలాగే పాకిస్థాన్‌కి చెప్పే స‌మాధానం కూడా మ‌రో రీతిలో ఉంటుంది. పాకిస్తాన్ వారు అలాంటి స‌మాధానాన్ని ఊహించ‌లేరు కూడా అంటూ ట్వీట్ చేసారు.

Advertisement
CJ Advs

దానికి రిచా చద్దా స్పందిస్తూ.. గాల్వ‌న్ సేస్ హాయ్‌ అంటూ ట్వీట్ చెయ్యడంతో.. ఆ వ్యాఖ్యలు ఇండియన్ ఆర్మీని అవమానించేలా ఉన్నాయంటూ రిచా చద్దాపై నెటిజెన్స్ విరుచుకుపడ్డారు. గాల్వాన్‌లో భార‌తీయ అమ‌ర వీరుల త్యాగాన్ని రిచా చ‌ద్దా అవమానపరిచింది అంటూ పెద్ద దుమారమే రేగింది. ఆ నెగిటివిటి చూసిన రిచా తను చేసిన తప్పుని సరిదిద్దుకోవడాని.. ట్వీట్ ని డిలేట్ చెయ్యడమే కాదు, ఇండియన్ ఆర్మీకి బహిరంగంగా క్షమాపణలు తెలుపుతున్నట్టుగా ట్వీట్ చేసింది.

అంతేకాకుండా తన ట్వీట్ వివాదానికి కారణమైంది, నేను ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో ఆ ట్వీట్ చెయ్యలేదు, ఇండియన్ ఆర్మీలో పనిచేసే నా సోదరులకు అది బాధని కలిగించి ఉండొచ్చు, అందుకే వాళ్ళని ఇలా క్షమాపణ కోరుతున్నా అంటూ.. తన ఫ్యామిలి కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేసే వారంటూ వివరణ ఇచ్చుకుంది.

After insulting Indian Army, Richa Chadha tenders apology:

Richa Chadha Apologises Amid Backlash Over Galwan Says Hi Tweet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs